Moviesరామ్ కెరీర్‌లో హ‌య్య‌స్ట్ బ‌డ్జెట్‌... క‌ళ్లు చెదిరే రేట్ల‌కు ' ది...

రామ్ కెరీర్‌లో హ‌య్య‌స్ట్ బ‌డ్జెట్‌… క‌ళ్లు చెదిరే రేట్ల‌కు ‘ ది వారియ‌ర్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌..!

చాలా రోజుల త‌ర్వాత ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో రామ్ రేంజ్ మారిపోయింది. చాలా రోజుల త‌ర్వాత మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా త‌ర్వాత ది వారియ‌ర్ సినిమాతో భారీ రేంజ్‌లో.. ఇంకా చెప్పాలంటే రామ్ కెరీర్‌లో భారీ బ‌డ్జెట్‌తో సినిమా చేస్తున్నాడు. ఓ వైపు భారీ ఖ‌ర్చుతో పాటు మ‌రోవైపు భారీ మార్కెటింగ్ కూడా జ‌రుగుతోంది. మాస్ డైరెక్ట‌ర్ లింగుస్వామితో చేస్తోన్న వారియ‌ర్ సినిమా ఫిగ‌ర్స్ చూస్తుంటే క‌ళ్లు చెదిరిపోయేలా ఉన్నాయి.

ఇక రామ్ కెరీర్‌లోనే ది వారియ‌ర్‌కు టాప్ బ‌డ్జెట్ అయ్యింది. ఈ సినిమా కోసం ఏకంగా రు. 70 కోట్లు ఖ‌ర్చు పెట్టార‌ట‌. కేవ‌లం ఇస్మార్ట్ శంక‌ర్ వ‌సూళ్ల లెక్క‌లు చూసి ఆ ధైర్యంతోనే ఈ రేంజ్‌లో ఖ‌ర్చు చేసిన‌ట్టుగా అర్థ‌మ‌వుతోంది. కోలీవుడ్ మాస్ డైరెక్ట‌ర్ లింగుస్వామికి తెలుగులో ఇదే ఫ‌స్ట్ సినిమా. రెమ్యున‌రేష‌న్లు, సెట్లు, కాస్టింగ్ ఇవ‌న్నీ క‌లిపి చూస్తే ఏకంగా రు. 70 కోట్లు సినిమా మీద పెట్టేశారు.

 

అటు ప్రి రిలీజ్ బిజినెస్ చూస్తే ఆంధ్రాలో రు. 17 కోట్ల రేంజ్‌లో క్లోజ్ చేశారు. నైజాంలో భేర‌సారాలు న‌డుస్తున్నాయ్‌. నిర్మాత రు. 16 కోట్లు అడుగుతున్నాట్ట‌. థియేట‌ర్ బిజినెస్ రు. 40 కోట్ల రేంజ్‌లో న‌డుస్తోంది. నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ ద్వారా రు. 32 కోట్లు అడుగుతున్నారు. అంటే ఇవ‌న్నీ క‌లుపుకుంటే రు. 72 కోట్ల రేంజ్‌లో ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగిన‌ట్టు..!

ఈ సినిమాకు ఈ రేంజ్‌లో బిజినెస్ జ‌ర‌గ‌డానికి మ‌రో కార‌ణం కూడా ఉంది. వారియ‌ర్ సినిమా త‌ర్వాత ఇదే బ్యాన‌ర్లో బోయ‌పాటి – రామ్ కాంబినేష‌న్లో సినిమా ఉంది. దీంతో లెక్క‌లు తేడా వ‌చ్చినా.. సినిమా కాస్త అటూ ఇటూ అయినా నెక్ట్స్ సినిమాకు చూసుకోవ‌చ్చులే అన్న‌ట్టుగా అడ్వాన్స్‌లు భారీగానే వ‌స్తున్నాయి. ఇక వారియ‌ర్ ట్రైల‌ర్ కూడా శుక్ర‌వారం లాంచ్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news