Moviesవావ్: సూపర్‌ స్టార్‌ కృష్ణ ఇల్లు చూశారా..ఎంత బాగుందో..అదే అన్నింటికన్నా స్పెషల్..!!

వావ్: సూపర్‌ స్టార్‌ కృష్ణ ఇల్లు చూశారా..ఎంత బాగుందో..అదే అన్నింటికన్నా స్పెషల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ ఫ్యామిలీ ఘట్టమనేని కుటుంబం. ఇండస్ట్రీలో ఈ పేరుకు ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. అలాంటి పేరుని సంపాదించి పెట్టారు సూపర్ స్టార్ కృష్ణ. తన యాక్టింగ్ తో..అందంతో..ఆ రోజుల్లో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశాడు. ఏ హీరో నాకు పోటీ కాదు అనే రేంజ్ లో కొత్త కొత్త కధలను జనాలకు పరిచయం చేశాడు. ఇప్పటికి కృష్ణ గారి యాక్టింగ్ స్టైల్ అంటే ఇష్టపడే జనాలు ఉన్నారు. ఆయనను ఆరాధించే వాళ్లు ఉన్నారు.

ఆయన వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చిన మహేశ్ బాబు కూడా సినీ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా..తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ..టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు గా నిలిచారు. కాగా, కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని కూడా సినిమాల్లో అడపదడపా నటించింది కానీ.. పెద్దగా క్లిక్ అవ్వలేదు. మంజుల సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే..ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి..అభిమానులకు మరింత దగ్గరైంది. ఇప్పటీకే తన ఛానెల్ లో కృష్ణ గారితో ఓ ఇంటర్వ్యు చేసి..టాప్ యూట్యూబర్ లిస్ట్ లోకి చేరిన మంజుల..రీసెంట్ గా కృష్ణ గారి ఇంటి హోమ్ టూర్ ని చేసింది. ఆ ఇల్లు చూడటానికి ఓ ఇంద్ర భవనంలా ఉంది. అన్ని సదుపాయాలతో..కళ్ళు జిగేలు మనేలా..చాలా అందంగా ఉంది.

ప్రోమోలోనే ఇల్లు ఇంత అందంగా చూయిస్తే..ఇక ఫుల్ వీడియో ఎలా ఉంటుందో అంటు జనాలు ఈగర్ గా ఈ వీడియో కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఇంటిలో అన్నింటికన్నా కూడా విజయ నిర్మల విగ్రహం స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. త్వరలోనే ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వీడియో రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news