Moviesభీమ్లా బ్యూటిని గోకిన స్టార్ మాజీ అల్లుడు..ఒక్క మాటతో ట్రెండింగ్...

భీమ్లా బ్యూటిని గోకిన స్టార్ మాజీ అల్లుడు..ఒక్క మాటతో ట్రెండింగ్ లోకి వచ్చిన సంయుక్తా మీనన్..?

సంయుక్తా మీనన్.. మనం ఈ పేరు ఈ మధ్య కాలంలోనే విన్నాం. కానీ ఆమె మలయాళంలో ఓ మంచి హీరోయిన్. పలు సినిమాల్లో చేసి స్టార్ సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ పాపులారిటితోనే పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ అయ్యింది. కానీ ఆ సినిమాలో అమ్మడి రోల్ చాలా చిన్నది. కాని ఇచ్చిన పాత్రకు న్యాయం చేసింది. ఏంత సేపు స్క్రీన్ పై కనిపించామా అన్నది కాదు..జనాలను మెప్పించామా లేదా అనేది ఇంపార్టెంట్ అంటూ తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది.

అయితే, ఆ సినిమా తరువాత అమ్మడు టాలీవుడ్ ని దున్నేస్తుంది అనుకున్నారంతా కానీ, అలా జరగలేదు. అయితే..ఈ మధ్య కాలంలో అమ్మడు ఖాతాలో మంచి మంచి ఆఫర్స్ వచ్చి పడ్డాయి. కళ్యాణ్ రామ్ బింబిసారా లో హీరోయిన్ గా నటిస్తుంది ఈ మలయాళ కుట్టి. అంతేకాదు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ “సార్” సినిమాలో కూడా నటిస్తుంది. అయితే, మీడియాలో గత కొద్ది రోజుల నుండి వీళ్లకు సంబంధించిన న్యూస్ లు వైరల్ అవుతున్నాయి . రీసెంట్ గా డివర్స్ తీసుకున్న ధనుష్ ఈ మలయాళ బ్యూటీని గోకాడని..అందుకు ఆమె ఓప్పుకోలేదని ..ధనుష్ బీహేవియర్ ఆమె తో సరిగ్గా లేదని..దీంతో ధనుష్ కు ఆమె కు మధ్య గొడవలు అవుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

దీని పై రీసెంట్ గా బింబిసారా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యులో ఇదే ప్రశ్న ఎదురైతే సంయుక్తా మీనన్ షాక్ అయ్యింది.”వాట్..మా ఇద్దరి పై అలాంటి న్యూస్ లు వచ్చాయా..నాకు ఇప్పటి వరకు తెలియదు. అలాంటి వార్త‌లు రాయాలంటే క్రియేటివిటీ ఉండాలి’ అంటూ ధనుష్‌తో గొడవలపై క్లారిటీ ఇచ్చింది. అంతేగాక మహేశ్‌-త్రివిక్రమ్‌లో చిత్రంలో తను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు బింబిసారాలో తన రోల్ చాలా ఢిఫరెంట్ అని..మీకు సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పుకొచ్చింది. దీంతో సంయుక్తా మీనన్ కామెంట్స్ ట్రెండ్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news