Movies' లైగర్ ' సినిమాలోని ఈ సీన్లు అన్నీ పూరీ ఆ...

‘ లైగర్ ‘ సినిమాలోని ఈ సీన్లు అన్నీ పూరీ ఆ సినిమా నుండి కాపీ కొట్టాడా…?

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఛార్మి పూరి జగన్నాథ్ మరియు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా ఆగస్టు 25న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో మైక్ టైసన్ కూడా ప్రధాన పాత్రలో నటించాడు.

దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. అయితే సినిమా ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం నెటిజెన్లు అచ్చం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన “అమ్మానాన్న ఓ తమిళమ్మాయి” సినిమా మాదిరిగా ఉందని ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాకుండా లైగర్ సినిమాకు “అమ్మానాన్న ఓ ముంబై అమ్మాయి” అనే టైటిల్ కరెక్ట్ గా సరిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

లైగర్ ట్రైలర్ లోని కొన్ని సీన్లు అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని సీన్ల మాదిరిగానే ఉన్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా 2003లో వ‌చ్చి హిట్ అయ్యింది. ర‌వితేజ‌, ఆశిన్ జంట‌గా న‌టించారు. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో ప్రకాష్ రాజ్ కిక్ బాక్సింగ్ కోసం భార్య అయిన జయసుధను వదిలి వెళ్ళిపోతాడ‌న్న సంగతి తెలిసిందే. ఇక లైగర్ సినిమాలో కూడా రమ్యకృష్ణ భర్త లేకుండా ఒంటరిగా కనిపిస్తోంది. దాంతో సినిమా లో మైక్ టైసన్ భార్యనే రమ్యకృష్ణ అయ్యి ఉంటుంది అనే అనుమానాలు మొదలయ్యాయి.

అంతే కాకుండా అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి మాదిరిగానే లైగర్ సినిమా లో కూడా అనన్య… విజయ్ తో ప్రేమలో పడుతుందని…. ఆ సినిమా లోని ఓ ముద్దు సీన్…. లైగర్ ట్రైలర్ లోని ముద్దు సీన్ ఒకేరకంగా ఉన్నాయంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి లైగర్ ను పూరీ జగన్నాథ్ అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయి సినిమాకు కాపీ గా తీసాడా ? లేదంటే కొత్తగా ఏమైనా ఉందా తెలియాలి అంటే లైగర్ సినిమా వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news