Moviesహీరోయిన్ క‌ళ్యాణి - డైరెక్ట‌ర్ సూర్య‌కిర‌ణ్ ఆ కార‌ణంతోనే విడాకులు తీసుకున్నారా...

హీరోయిన్ క‌ళ్యాణి – డైరెక్ట‌ర్ సూర్య‌కిర‌ణ్ ఆ కార‌ణంతోనే విడాకులు తీసుకున్నారా…

టాలీవుడ్ లో హీరోలు, హీరోయిన్లు – దర్శకులు, హీరోయిన్ల మధ్య ప్రేమలు.. డేటింగులు, బ్రేకప్ లు చాలా కామన్. ఈ క్రమంలోనే కొందరు ప్రేమలో పడి పెళ్లి వరకు వెళ్తున్నారు. మరికొందరు పెళ్లి చేసుకుని సంసారం చేశాక కూడా విడాకులు తీసుకుంటున్నారు. ఈ లిస్టులోకే వస్తారు హీరోయిన్ కళ్యాణి, డైరెక్టర్ సూర్యకిరణ్ దంపతులు. వాస్తవానికి రెండు దశాబ్దాల క్రితమే హీరోయిన్ గా కళ్యాణి.. డైరెక్టర్ గా సూర్య కిరణ్ టాలీవుడ్‌లో తమ కెరియర్‌ను మొదలుపెట్టారు. కెరియర్ స్టార్టింగ్ లో సూర్య కిరణ్ కు సుమంత్ హీరోగా సత్యం లాంటి సినిమాతో మంచి హిట్‌ పడింది. అదే టైంలో కళ్యాణి, వంశీ దర్శకత్వంలో వచ్చిన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో మొదలుపెట్టి వరుసగా సక్సెస్ సినిమాల్లో నటించింది.

సూర్య కిరణ్ కంటే కళ్యాణి తెలుగు ప్రేక్షకుల మ‌దిలో అచ్చ తెలుగు ఆడపడుచులా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. వీళ్లిద్దరూ కూడా మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందినవారే. సూర్య కిరణ్ కూడా బాల‌న‌టుడిగా పరిచయమై 200 కు పైగా సినిమాల్లో నటించాడు. ఆ తరువాత వరుసగా ప్లాపులు రావటంతో సూర్య కిరణ్ కు అవకాశాలు లేకుండా పోయాయి. అదే టైంలో తమ ఫ్యామిలీ ఫ్రెండ్ గా మారిన కళ్యాణిని సూర్యకిరణ్ వివాహం చేసుకున్నాడు. 10 సంవత్సరాల పాటు ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగాా ఉన్నారు. పది సంవత్సరాల‌ తర్వాత సడన్‌గా వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నట్టు చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. విడాకులకు కారణం ఏంటని ?ఇప్పటివరకు ఎవరు వెల్లడించలేదు.

అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో సూర్యకిరణ్ తమ విడాకులకు గల కారణాలను బయట ప్రపంచానికి వెల్లడించారు. తాము విడాకులు తీసుకున్న సమయంలో కూడా జడ్జ్ మమ్మల్ని విడాకులు తీసుకోవడానికి కారణాలు ఏమిటి అని ప్రశ్నించారని.. తాను కారణాలు ఏమీ లేవని చెప్పాను… అయితే అదే సమయంలో జడ్జ్ కళ్యాణితో మీ ఆయన మిమ్మల్ని సరిగా చూసుకోవడం లేదా ? నిన్ను హింసిస్తున్నారా ? అదనపు కట్నం కోసం వేధిస్తున్నారా ? అని పలు ప్రశ్నలు వేశారని… అయితే ఆ ప్రశ్నలు అన్నిటికీ కల్యాణి నో అని చెప్పింద‌ని సూర్య చెప్పారు. ఇక తమకు పిల్లల కూడా లేరని మేం విడిపోవడానికి పిల్లలు కూడా కారణం అనుకుని జడ్జి చెప్పారు అంట.

ఇక విడాకులు తీసుకుని కోర్టు బయటకు వచ్చాక తాను కళ్యాణితో డబ్బులు వచ్చి.. అప్పులు అన్ని తీర్చేశాక‌.. తిరిగి మన ఇద్దరం మ‌ళ్లీ పెళ్లి చేసుకుందామని అన్నట్టు సూర్యకిరణ్ అన్నాడు. దీనిబట్టి చూస్తే వీరిద్దరి విడాకుల‌కు కారణం ఆర్థికపరమైన ఇబ్బందులే అని అర్థమవుతుంది. తాము భార్యాభర్తలుగా విడిపోయినా.. మంచి స్నేహితులుగా కొనసాగుతున్నామని.. అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటామని సూర్య కిరణ్ చెప్పారు. ఇక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా పలు సీరియల్స్ లో నటించిన సుజిత‌ సూర్య కిరణ్ కు స్వయానా సోదరి కావడం విశేషం. సూర్య కిరణ్ చేసిన కొన్ని సినిమాలు ప్లాప్ అవటంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకు పోయాడు. ఈ క్రమంలోనే అప్పులు ఇచ్చినవారు పదేపదే ఇంటికి రావడంతో విసుక్కుపోయిన కళ్యాణి.. సూర్య కిరణ్ కు విడాకులు ఇచ్చిందని ఒక ప్రచారం ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news