Moviesఇదేం కర్మ రా బాబు....ఎన్ని కోట్లు ఉన్న ఆ కోరిక తీర్చుకోలేకపోతున్న...

ఇదేం కర్మ రా బాబు….ఎన్ని కోట్లు ఉన్న ఆ కోరిక తీర్చుకోలేకపోతున్న అక్కినేని కుర్రాళ్లు..?

యస్..ఇప్పుడు ఇదే విషయం నెట్టింట వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరోలు అంటే..ఓ సపరేటు క్రేజ్ ఉంది. అలాంటి ఓ మార్క్ ని సెట్ చేసిపెట్టారు అక్కినేని నాగేశ్వరావు గారు. ఆయన వారసత్వాని కంటిన్యూ చేస్తున్నాడు నాగార్జున. ఇండస్ట్రీలో నాగ్ రేంజ్, క్రేజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆయన ఎప్పటికి టాలీవుడ్ కి మన్మధుడే. స్టార్ హీరోల భార్యలు కూడా అయనకి డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారంటేనే ఆయన్ రేంజ్ అర్ధం చేసుకోవచ్చు.

అయితే, ఆయన వార్సులుగా ఇండస్ట్రీకి వచ్చిన నాగ చైతన్య, అఖిల్ మాత్రం..ఇంకా సెటిల్ అవ్వలేలేదు. నాగచైతన్య తన నటనతో పర్లేదు అనిపించినా..అఖిల్ మాత్రం..ఫ్లాప్ హీరోగానే ఉండిపోయాడు. మిగత స్టార్ హీరో వారసులు అంతా.. పాన్ ఇండియా సినిమాలని.. 100 కోట్ల క్లబ్ అని సినిమా సినిమాకి తమ రేంజ్ ను పెంచుకుంటూ ఉంటే..ఈ అక్కినేని కుర్రాళ్లు మాత్రం ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వడానికే ఉన్న టైం వేస్ట్ చేసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ..ఇప్పటి వరకు ఈ హీరోలు ఒక్కరు కూడా 100 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అవ్వలేదు. నాగ్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బోలెడు బిజినెస్ లు..ప్రముఖ సస్ధల్లో పెట్టుబడులు..భారీ లాభాలు వస్తుంటాయి. కానీ, ఏం లాభం కొడుకులను స్టార్ హీరోలగా నిలబెట్టలేకపోతున్నాడు..వాళ్ళ రేంజ్ మార్చలేకపోతున్నాడు ..అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. మరి అక్కినేని కుర్రాళ్లు 100 కోట్ల క్లబ్ లోకి ఎప్పుడు చేరుతారో చూడాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news