Moviesత‌గ్గేదేలే అంటోన్న బాల‌య్య‌... తేల్చుకోవాల్సింది మెగాస్టారే...!

త‌గ్గేదేలే అంటోన్న బాల‌య్య‌… తేల్చుకోవాల్సింది మెగాస్టారే…!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ – మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీప‌డితే వార్ ఎలా ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు అంటే అంత యుద్ధాలు జ‌ర‌గ‌డం లేదు కాని.. ఒక‌ప్పుడు చిరంజీవి, బాల‌య్య సినిమాలు సంక్రాంతికి వ‌స్తున్నాయంటే.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద యుద్ధ‌మే న‌డిచేది. స‌మ‌ర‌సింహారెడ్డి, స్నేహంకోసం, న‌ర‌సింహానాయుడు, మృగ‌రాజు సినిమాలు రిలీజ్ అయిన‌ప్పుడు అస‌లు ఆంధ్ర‌దేశం అంతా షేక్ అయిపోయింది.

ఇక చిరు పదేళ్ల‌పాటు సినిమాల‌కు గ్యాప్ తీసుకుని 2017లో త‌న 150వ సినిమా ఖైదీనెంబ‌ర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అదే 2017 సంక్రాంతికి బాల‌య్య వందో సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణితో బాక్సాఫీస్ వ‌ద్ద గ‌ర్జించాడు. నిజం చెప్పాలంటే ఈ రెండు సినిమాలు పోటాపోటీగా ఆడాయి. క‌లెక్ష‌న్ల ప‌రంగా చిరు సినిమా కాస్త పైచేయి సాధించినా.. పేరు మాత్రం బాల‌య్య శాత‌క‌ర్ణికే వ‌చ్చింది.

ఈ వార్ త‌ర్వాత ఇప్పుడు వ‌చ్చే సంక్రాంతికి కూడా మ‌రోసారి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బాల‌య్య వ‌ర్సెస్ చిరు యుద్ధం త‌ప్పేలా లేదు. బాల‌య్య 107వ సినిమాను మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. అఖండ త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో పాటు, ఇటు గోపీచంద్ క్రాక్ హిట్ కొట్టాక డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. పైగా శృతీహాస‌న్ హీరోయిన్‌. అటు వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కూడా ఉంది.

జై బాల‌య్యా టైటిల్ అంటున్నారు. దీంతో అంచ‌నాలు ఆకాశంలోనే ఉన్నాయి. క‌ట్ చేస్తే ఈ సినిమాను ద‌స‌రా లేదా డిసెంబ‌ర్లో రిలీజ్ చేస్తార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు వార్త‌లు వ‌చ్చాయి. అయితే షాకింగ్ అప్‌డేట్ ఏంటంటే వ‌చ్చే సంక్రాంతి బ‌రిలోనే ఈ సినిమాను దించుతున్నార‌ట‌. ఈ సినిమా మైత్రీ వాళ్ల‌ది. అదే బ్యాన‌ర్లో ఆల్రెడీ మెగాస్టార్ చిరు 154వ సినిమా కూడా సంక్రాంతికే అంటున్నారు. బాబి ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు.. ఇదే శృతీహాస‌న్ హీరోయిన్‌.

ముందు చిరంజీవి సినిమాయే సంక్రాంతికి వ‌స్తుంద‌ని చెప్పారు. అయితే ఇప్పుడు బాల‌య్య కూడా త‌గ్గేదేలే అంటూ ద‌స‌రా, డిసెంబ‌ర్ నుంచి సంక్రాంతికి దింపుతున్నాడు. మ‌రి చిరు సినిమా మేక‌ర్స్ త‌మ సినిమాను సంక్రాంతికే దింపుతారా ? లేదా త‌ప్పిస్తారా ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news