Moviesచిరంజీవికి ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిన బాల‌య్య‌... అస‌లు మ‌జా అంటే ఇదే..!

చిరంజీవికి ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిన బాల‌య్య‌… అస‌లు మ‌జా అంటే ఇదే..!

టాలీవుడ్ సీనియ‌ర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ దాదాపుగా నాలుగు ద‌శాబ్దాలుగా సినిమా ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్నారు. వీరిద్ద‌రు బ‌ల‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. నాలుగు ద‌శాబ్దాల కెరీర్‌లో వీరిద్ద‌రు త‌మ సినిమాల‌తో ఒకేసారి పోటీ ప‌డి బాక్సాఫీస్‌ను ఎన్నోసార్లు హీటెక్కించారు. వీరిద్ద‌రి సినిమాలు ఒకేసారి ఎప్పుడు రిలీజ్ అయినా ఇద్ద‌రు హీరోల అభిమానుల‌తో తెలుగుగ‌డ్డ అదిరిపోయేది.

అందులోనూ చిరు, బాల‌య్య సంక్రాంతికి ఒకేసారి వ‌స్తే థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోయేవి. ఇద్ద‌రు హీరోల్లో ఎవ‌రి సినిమా బాగా ఆడుతుంది ? ఎవ‌రి సినిమాకు ఎన్ని వ‌సూళ్లు వ‌స్తాయి ? ఎవ‌రి సినిమా ఎక్కువ సెంట‌ర్ల‌లో 50, 100 రోజులు ఆడుతుంది.. ఇవే చ‌ర్చ‌లు నాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌ట్టిగా జ‌రిగేవి. అయితే ఈ ఇద్ద‌రు హీరోలు సంక్రాంతికి పోటీప‌డిన‌ప్పుడు బాల‌య్య స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు లాంటి ఇండ‌స్ట్రీ హిట్లు కొట్ట‌గా.. చిరు కూడా చాలా సార్లు బాల‌య్య సినిమాల‌కు గ‌ట్టి పోటీ ఇచ్చాడు.

చివ‌ర‌కు 2017లో ఈ ఇద్ద‌రు అగ్ర హీరోలు త‌మ కెర‌ర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన సినిమాల‌తో మ‌రోసారి సంక్రాంతికి పోటీప‌డ్డారు. చిరు 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150, బాల‌య్య 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాలు సంక్రాంతికే వ‌చ్చాయి. ఈ రెండు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. ప‌దేళ్ల త‌ర్వాత కం బ్యాక్ ఇచ్చిన చిరు సినిమాకే ఎక్కువ క‌లెక్ష‌న్లు వ‌చ్చినా.. విమ‌ర్శ‌కులు, ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు మాత్రం బాల‌య్య సినిమాకే ద‌క్కాయి.

చిరు సినిమా కోలీవుడ్ మూవీ క‌త్తికి రీమేక్ కావ‌డం.. ఇటు బాల‌య్య డేరింగ్ స్టెప్ వేసి శాత‌వాహ‌న చ‌క్ర‌వ‌ర్తి జీవిత చ‌రిత్ర‌ను సినిమాగా తెర‌కెక్కించి హిట్ కొట్ట‌డంతో అంద‌రూ బాల‌య్య‌ను ఆకాశానికి ఎత్తేశారు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ ఐదేళ్ల‌కు బాల‌య్య‌, చిరు ఒకేసారి బాక్సాఫీస్ వ‌ద్ద పోటీకి రెడీ అవుతున్న‌ట్టుగా తెలుస్తోంది. బాల‌య్య – మ‌లినేని గోపీచంద్ కాంబోలో వ‌స్తోన్న 107వ సినిమా… చిరు లూసీఫ‌ర్ రీమేక్ గాడ్‌ఫాథ‌ర్ కూడా ద‌స‌రాకే వ‌స్తోంది. ముందుగా గాడ్‌ఫాథ‌ర్‌ను ద‌స‌రాకు రిలీజ్ చేస్తున్న‌ట్టు ఎనౌన్స్ చేశారు. ఇప్పుడు బాల‌య్య కూడా త‌న సినిమా షూటింగ్ స్పీడ్‌గా పూర్త‌వ్వ‌డంతో ద‌స‌రాకే రిలీజ్ చేయాల‌ని ఫిక్స్ అయిపోయార‌ట‌.

ఈ రెండు సినిమాల బ‌డ్జెట్‌లు దాదాపు స‌మాన‌మే. రెండు సినిమాల వెన‌క పెద్ద బ‌డా బ్యాన‌ర్లే ఉన్నాయి. బాల‌య్య సినిమాను మైత్రీ మూవీస్ వాళ్లు నిర్మిస్తుంటే.. చిరు గాడ్‌ఫాథ‌ర్‌ను కొణిదెల సురేఖ స‌మ‌ర్ప‌ణ‌లో ఆర్‌బి. చౌద‌రి నిర్మిస్తున్నారు. ఏదేమైనా చిరు సోలోగా ద‌స‌రాకు బాక్సాఫీస్‌ను దున్నేయాల‌ని ప్లాన్ చేస్తే… బాల‌య్య స‌డెన్ ట్విస్ట్‌తో ఆయ‌న‌కు పోటీగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్ప‌టికే రెండు సినిమాల ఫ‌స్ట్ లుక్స్ కూడా రిలీజ్ అయ్యాయి. మ‌రి ఈ వార్‌లో ఏ హీరో ద‌స‌రాకు పాగా వేస్తాడో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news