Moviesతెలుగు బ్యూటీ శ్రీలీల ఏజ్ గురించి న‌మ్మ‌లేని నిజాలు...!

తెలుగు బ్యూటీ శ్రీలీల ఏజ్ గురించి న‌మ్మ‌లేని నిజాలు…!

ఇప్పుడు టాలీవుడ్‌లో అంతా శ్రీలీల జ‌పం న‌డుస్తోంది. పూజా హెగ్డే, ర‌ష్మిక టాప్ హీరోయిన్లుగా ఉన్నా వీళ్ల రెమ్యున‌రేష‌న్లు, డిమాండ్ల దెబ్బ‌తో స్టార్ హీరోలు, ద‌ర్శ‌క నిర్మాత‌లు కాస్త ఆలోచ‌న‌లో ప‌డుతున్నారు. అన్నింటికి మించి తెలుగ‌మ్మాయి అవ్వ‌డంతో పాటు యూత్‌లో ఇప్ప‌డు పిచ్చ క్రేజ్ తెచ్చుకున్న శ్రీలీల వెంట ప‌డుతున్నారు. ఇప్ప‌టికే టైర్ 2 రేంజ్ స్టార్ హీరోలు అంద‌రూ శ్రీలీల‌తో ఒక్క సినిమా చేసే ఛాన్స్ కోస‌మే వెయిట్ చేస్తున్నారు.

చివ‌ర‌కు బాల‌య్య – అనిల్ రావిపూడి కాంబోలో వ‌స్తోన్న సినిమాలో సైతం శ్రీలీల బాల‌య్య‌కు కూతురుగా క‌నిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఏపీలోని విజ‌య‌వాడ‌కు చెందిన అమ్మాయే అయినా శ్రీలీల ఎక్కువుగా పెరిగింది.. చ‌దువుకుంది అంతా బెంగ‌ళూరే. అందుకే ఆమెను కొంద‌రు క‌న్న‌డ అమ్మాయి అని పొర‌బ‌డుతూ ఉంటారు. మోడ‌లింగ్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీలీల ద‌ర్శకేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో గౌరి రోణింకి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పెళ్లిసంద‌D సినిమాతో హీరోయిన్‌గా వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యింది.

ఆనాటి శ్రీకాంత్ పెళ్లిసంద‌డిని గుర్తు చేస్తూ శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరోగా వ‌చ్చిన ఈ పెళ్లిసంద‌డి సినిమాకు ముందుగా యావ‌రేజ్‌, ప్లాప్ టాక్ వ‌చ్చినా త‌ర్వాత అనూహ్యంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర హిట్ అయ్యింది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం కేవ‌లం హీరోయిన్ శ్రీలీలే అని ట్రేడ్ వ‌ర్గాలు ఖ‌రాఖండీగా చెప్పేశాయి. దీంతో శ్రీలీల క్రేజ్ మామూలుగా రాలేదు. అక్క‌డ నుంచి ఆమెకు వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

జూనియ‌ర్ ఎన్టీఆర్ – కొర‌టాల సినిమాలో సైతం రెండో హీరోయిన్ పాత్ర‌కు ఆమె ప‌రిశీలించే వ‌ర‌కు వ‌చ్చేసింది. వ‌రుస అవ‌కాశాల‌కు తోడు ఆమె త‌న రేటు కూడా పెంచేసింది. శ్రీలీల ఇటీవ‌ల హాట్ డ్రెస్సులు, క్యూట్ లుక్స్‌తో సోష‌ల్ మీడియాను హీటెక్కించేస్తోంది. ఇంత‌కు ఆమె ఏజ్ ఎంతన్న‌ది కూడా ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మందికి తెలియ‌దు. తాజాగా ఆమె నిన్న 20 ఏళ్లు పూర్తి చేసుకుంది.

అస‌లు శ్రీలీల‌కు జ‌స్ట్ 20 ఏళ్ల వ‌య‌స్సు మాత్ర‌మే అంటే మ‌నం న‌మ్మ‌లేం. కానీ ఆమె గ్లామ‌ర్‌.. మెయింటైన్ చేస్తోన్న తీరుకు మాత్రం ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవ్వాల్సిందే. అంటే పెళ్లిసంద‌డి షూటింగ్ టైంకు ఆమెకు జ‌స్ట్ 17 ఏళ్లు మాత్ర‌మే. ఆమె ప్ర‌స్తుతం ర‌వితేజ స‌ర‌స‌న న‌క్కిన త్రినాథ‌రావు డైరెక్ట్ చేసిన ధ‌మాకా సినిమాతో పాటు తాజాగా న‌వీన్ పోలిశెట్టి ప‌క్క‌న సితారా వాళ్లు నిర్మించే సినిమాలో కూడా న‌టిస్తోంది. ఏదేమైనా టాలీవుడ్‌లో శ్రీలీల‌దే భ‌విష్య‌త్ రాజ్యం అన్న‌ట్టుగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news