Moviesటాలీవుడ్‌లో 4 జంట‌ల జీవితాల్లో డైవ‌ర్స్ బెల్స్‌... ఆ 4 జంట‌లు...

టాలీవుడ్‌లో 4 జంట‌ల జీవితాల్లో డైవ‌ర్స్ బెల్స్‌… ఆ 4 జంట‌లు వీళ్లే…!

ఇటీవ‌ల కాలంలో సెల‌బ్రిటీలు వ‌రుస‌గా విడాకులు తీసేసుకుంటున్నారు. మంచినీళ్లు తాగినంత ఈజీగా సెల‌బ్రిటీలు విడాకుల‌కు వెళ్లిపోతున్నారు. యేళ్ల‌కు యేళ్లుగా ప్రేమ‌లు.. పెళ్లి త‌ర్వాత క‌లిసున్న రోజులు.. ఆ అప్యాయ‌త‌లు, అనురాగాలు ఏమైపోతున్నాయో అర్థం కావ‌డం లేదు. గ‌తేడాది చివ‌ర్లో అక్కినేని నాగ‌చైత‌న్య – స‌మంత జంట విడాకులు తీసుకున్న‌ప్ప‌టి నుంచే ఈ విడాకుల ప‌ర్వం మొద‌లైంది. చైతు – స‌మంత త‌ర్వాత అమీర్‌ఖాన్ – కిర‌ణ్‌రావు, ధ‌నుష్ – ఐశ్వ‌ర్య విడిపోయారు.

అప్ప‌టి నుంచి ఈ విడాకుల ప‌రంప‌ర ఆగ‌డం లేదు. తాజాగా టాలీవుడ్‌లో ఓ న‌లుగురు జంట‌లు కూడా విడాకుల బాట‌లో ఉన్నారు. మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజ, హీరో క‌ళ్యాణ్‌దేవ్ విడిపోతున్నారంటూ ఆరు నెల‌లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. శ్రీజ‌కు ఇది రెండో పెళ్లి. మెగా అల్లుడు అయ్యాకే క‌ళ్యాణ్‌దేవ్ విజేత‌, సూప‌ర్‌మ‌చ్చి, కిన్నెర‌సాని సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇప్పుడు ఈ దంప‌తులు ఇద్ద‌రూ దూరంగానే ఉంటున్నార‌ట‌.

ఇక ఎందుకోకాని యంగ్ హీరో నిఖిల్ విష‌యంలోనూ సోష‌ల్ మీడియాలో ఇదే రూమ‌ర్లు స్ప్రెడ్ అవుతున్నాయి. కొంద‌రు నిఖిల్ పేర్లు పెట్టి వార్త‌లు రాస్తున్నా నిఖిల్ వైపు నుంచి ఎలాంటి ఖండ‌నా లేదు. క‌రోనా టైంలోనే అతి కొద్ది మంది స‌న్నిహితుల స‌మ‌క్షంలోనే నిఖిల్ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు భార్య‌, భ‌ర్త‌ల మ‌ధ్య తేడా రావ‌డంతో వీరు కూడా దూరంగానే ఉంటున్నార‌ని అంటున్నారు. ఇది నిజం కాక‌పోతే నిఖిల్ ఒక్క క్లారిటీ ఇచ్చేస్తే అంద‌రి నోళ్లు మూత‌ప‌డ‌తాయి.

ఇక మ‌రో జంట సింగ‌ర్లు అయిన హేమ‌చంద్ర – శ్రావ‌ణ భార్గ‌వి. వీరు కూడా ప్రేమ వివాహం చేసుకుని ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇక వీరిద్ద‌రి మ‌ధ్య విబేధాలు రావ‌డంతో వీరు కూడా విడిపోయేందుకు దాదాపుగా నిర్ణ‌యం తీసుకున్నార‌ని సోష‌ల్ మీడియాను ఒక్క‌టే వార్త ఊపేస్తోంది. అయితే దీనిపై ఈ జంట‌లో ఎవ్వ‌రూ స్పందించ‌డం లేదు. ఈ దంప‌తుల‌కు కూడా ఓ పాప ఉంది.

ఇక పై మూడు జంట‌ల‌తో పాటు రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న మ‌రో యంగ్ హీరో సైతం ఇప్పుడు విడాకుల బాట‌లోనే ఉన్నాడ‌ట‌. ఈ దంప‌తుల‌కు కూడా ఓ బిడ్డ ఉన్నాడు. వీరు దూరంగా ఉంటున్నా కుటుంబ సభ్యులు , స‌న్నిహితులు స‌ర్దిచెప్ప‌డంతో కొద్ది రోజుల పాటు సైలెంట్‌గా ఉన్నార‌ట‌. వీరు కూడా ఎప్పుడైనా విడిపోవ‌చ్చ‌నే అంటున్నారు. ఏదేమైనా ఇండ‌స్ట్రీ వాళ్ల జీవితాల్లో చిన్న చిన్న ఇగోలే పెద్ద గొడ‌వ‌లుగా మారి అవి సింపుల్‌గా విడాకుల వ‌ర‌కు వెళ్లిపోతున్నాయి

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news