Moviesఎన్టీఆర్ చేయాల‌నుకున్న ఆఖ‌రు సినిమా టైటిల్ ఇదే... స్క్రిఫ్ట్ ఇంకా బాల‌య్య...

ఎన్టీఆర్ చేయాల‌నుకున్న ఆఖ‌రు సినిమా టైటిల్ ఇదే… స్క్రిఫ్ట్ ఇంకా బాల‌య్య ద‌గ్గ‌రే భ‌ద్రంగా ఉందా…!

దివంగ‌త విశ్వవిఖ్యాత న‌ట‌సౌర్వ‌భౌమ ఎన్టీఆర్ త‌న కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించారు. అయితే ఆయ‌న కొంద‌రిని త‌న గురువులుగా భావించేవారు. అలాంటి వారిలో కెవి. రెడ్డి, చక్ర‌పాణి త‌దిత‌రులు ఉండేవారు. త‌న గురువుల‌ను ఎన్టీఆర్ ఎంతో ఉన్నంత‌గా చూసుకునేవార‌ట‌. వారిని అమితంగా ప్రేమించ‌డంతో పాటు త‌న జీవితంలో వారికి ఏదో ఒక అనుబంధం ఉండేలా చూసుకునేవార‌ట‌.

కెవి. రెడ్డి అంటే ఎన్టీఆర్‌కు గురు స‌మానులు. అలాంటి ఆయ‌న కెరీర్ చివ‌రి ద‌శ‌లో త‌న బ్యానర్లోనే ఓ సినిమా చేయించుకోవాల‌ని ఎన్టీఆర్ అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే శ్రీకృష్ణ స‌త్య సినిమా చేశారు. క‌మ‌ర్షియ‌ల్ ప‌రంగా చూస్తే కెవి. రెడ్డికి ఇదే చివ‌రి బ్లాక్‌బ‌స్ట‌ర్ అని చెప్పుకోవాలి. ఆయ‌న జీవిత చ‌ర‌మాంకంలో ఉండ‌గా ఆయ‌న్ను చూసేందుకు ఎన్టీఆర్, ప్ర‌ముఖ ర‌చ‌యిత న‌ర‌స‌రాజు క‌లిసి వెళ్లార‌ట‌.

కింద ఫోర్ష‌న్‌లో కెవి. రెడ్డి భార్య‌ను ముందుగా ప‌ల‌క‌రించార‌ట‌. అందుకు ఆమె తాను ఉండ‌గానే త‌న భ‌ర్త చ‌నిపోతే బాగుంటుంద‌ని అన‌డంతో ఎన్టీఆర్ అదేంట‌మ్మా అంత‌మాట అన్నారు ? అని ప్ర‌శ్నించార‌ట‌. త‌న భ‌ర్త మొహ‌మాట‌స్తుడు అని.. తాను చ‌నిపోయాక క‌నీసం అన్నం పెట్ట‌మ‌ని కూడా త‌న కోడ‌ళ్ల‌ను అడిగేందుకు ఆయ‌న ఇష్ట‌ప‌డ‌రు అని చెప్పార‌ట‌.

ఆ త‌ర్వాత పై అంత‌స్తులో ఉన్న కెవి. రెడ్డి గారి ద‌గ్గ‌ర‌కు వెళ్లార‌ట‌. ఆయ‌న కూడా అదే మాట చెప్పార‌ట‌. త‌న భార్య‌ను కోడ‌ళ్లు స‌రిగా చూసుకుంటారో ? లేదో ? తాను ఉండ‌గానే ఆమెను చ‌క్క‌గా చూసుకుంటాన‌ని.. త‌న చేతుల్లోనే ఆమె వెళ్లిపోవాల‌ని కోరుకుంటున్నాన‌ని చెప్పార‌ట‌. అనంత‌రం ఎన్టీఆర్ – న‌ర‌స‌రాజు ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి అక్క‌డ ఇదే లైన్ బేస్ చేసుకుని మూడు గంట‌ల పాటు చ‌ర్చ‌లు జ‌రిపార‌ట‌.

ఆ వ‌య‌స్సులో ఉన్న భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రూ ఇలా ఆలోచిస్తే ఏం జ‌రుగుతుంద‌న్న లైన్ తీసుకుని ఓ క‌థ డవ‌ల‌ప్ చేయ‌మ‌ని న‌ర‌స‌రాజు గారికి చెప్పార‌ట‌. ఈ సినిమాకు టైటిల్ కూడా పుణ్య‌దంప‌తులు అని ఎన్టీఆర్ డిసైడ్ చేశార‌ట‌. ఆ క‌థ‌ను ఎలాగైనా సినిమాగా తీయాల‌ని ఎన్టీఆర్ గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ట‌. అయితే ఎన్టీఆర్ మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి అవ్వ‌డం.. రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌డంతో ఆ సినిమా చేయ‌లేక‌పోయారు.

ఆ స్క్రిఫ్ట్ ఎన్టీఆర్ బెంచ్ లాక‌ర్‌లో భ‌ద్రంగా ఉంద‌ట‌. ఎన్టీఆర్ చ‌నిపోయాక కూడా ఆ లాక‌ర్ ఓపెన్ కాక‌పోతే దానిని ప‌గ‌ల‌గొట్టి తీస్తే అందులో ఈ పుణ్య‌దంప‌తులు స్క్రిఫ్ట్ ఉంద‌ట‌. ఈ స్క్రిఫ్ట్ ఇప్ప‌ట‌కీ బాల‌య్య ద‌గ్గ‌రే భ‌ద్రంగా ఉంది. ఏదేమైనా ఎన్టీఆర్ సినిమాగా తీయాల‌నుకున్నా పుణ్య‌దంప‌తులు సినిమా రాలేదు. మ‌రి బాల‌య్య ఎప్ప‌ట‌కీ అయినా ఆ క‌థ‌ను ఇప్ప‌టి నేటివిటికి అనుగుణంగా మార్చి తీర్చే సాహ‌సం చేస్తారేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news