Moviesవిడాకులు తీసుకున్న మ‌హిళ‌ల‌ను పెళ్లాడిన 5 గురు స్టార్‌ క్రికెట‌ర్లు వీళ్లే...!

విడాకులు తీసుకున్న మ‌హిళ‌ల‌ను పెళ్లాడిన 5 గురు స్టార్‌ క్రికెట‌ర్లు వీళ్లే…!

సెల‌బ్రిటీల్లో విడాకులు తీసుకున్న వాళ్ల‌ను కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డం కామన్‌. ఇటీవ‌ల ఈ క‌ల్చ‌ర్ బాగా ఎక్కువ అయిపోయింది. పెళ్ల‌య్యి ప‌దేళ్లు అయినా కూడా ప‌లు రంగాల్లో ఉన్న సెల‌బ్రిటీలు భార్య‌ల‌కు విడాకులు ఇచ్చేసి అప్ప‌టికే పెళ్ల‌య్యి భ‌ర్త‌ల‌కు విడాకులు ఇచ్చిన మ‌హిళ‌ల‌ను మ‌ళ్లీ పెళ్లి చేసుకోవ‌డ‌మో లేదా ఎఫైర్లు పెట్టుకోవ‌డ‌మో చేస్తున్నారు. ఇక మ‌న భారత టీంలో ఉన్న క్రికెట‌ర్లు సైతం ఉన్నారు. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా ఐదుగురు క్రికెట‌ర్లు విడాకులు ఇచ్చేసిన మ‌హిళ‌ల‌నే భార్య‌ల‌ను చేసుకున్నారు.

1- శిఖ‌ర్ ధావ‌న్ :
శిఖ‌ర్ ధావ‌న్ 2012లో అయేషా ముఖ‌ర్జీని పెళ్లి చేసుకున్నాడు. అయేషా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉండే బ్రిటీష్ బెంగాలి మ‌హిళ‌. ఆమె బెంగాలీ మూలాలు ఉన్నా బ్రిట‌న్‌లో ఉండేది. అయేషాకు ముందు భ‌ర్త‌తో విడాకులు తీసుకుంది. ఆమెకు మొద‌టి భ‌ర్త ద్వారా ఇద్ద‌రు కుమార్తెలు కూడా ఉన్నారు. పైగా శిఖ‌ర్ ధావ‌న్ కంటే వ‌య‌స్సులో చాలా పెద్ద‌ది. వీరిద్ద‌రి మ‌ధ్య వ‌య‌స్సులో 10 ఏళ్ల గ్యాప్ ఉంది. ఇక గ‌తేడాది వీరిద్ద‌రు కూడా విడాకులు తీసుకున్నారు.

2- అనిల్ కుంబ్లే :
భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ లెగ్‌స్పిన్న‌ర్ అనిల్ కుంబ్లే కూడా మొద‌టి భ‌ర్త‌కు విడాకులు ఇచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. చేత‌న అనే మ‌హిళ‌కు ముందుగా పెళ్ల‌య్యి భ‌ర్త‌తో విడాకులు అయిపోయాయి. ఆ త‌ర్వాత ఆమెతో అనిల్‌కు ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారి వారు పెళ్లి చేసుకునే వ‌ర‌కు వెళ్లింది.

3- మ‌హ్మ‌ద్ ష‌మీ :
భార‌త క్రికెట్ జ‌ట్టు ఫాస్ట్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ సైతం హ‌సీన్ జ‌హాను పెళ్లాడాడు. అయితే హ‌సీన్‌ను ముందుగా ఓ పెళ్లి అవ్వ‌గా భ‌ర్త‌తో విడాకులు తీసుకుంది. మోడ‌లింగ్ చేసే క్ర‌మంలో ష‌మీతో ఏర్ప‌డిన ప‌రిచ‌యంతో ప్రేమ‌గా వీరిద్ద‌రు 2014లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట‌కు ఓ పిల్లాడు పుట్టాడు. అయితే ప్ర‌స్తుతం వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌ల నేప‌థ్యంలో వేర్వేరుగా ఉంటున్నారు.

4- ముర‌ళీ విజ‌య్ :
భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ఓపెనర్ ముర‌ళీ విజ‌య్ ప్రేమ పెళ్లి మ‌రీ విచిత్రం. త‌న స్నేహితుడు అయిన మ‌రో క్రికెట‌ర్ దినేష్ కార్తీక్ భార్య‌తో ఎఫైర్ పెట్టుకున్నాడు. దినేష్ కార్తీక్‌కు నిఖిత చిన్న‌ప్ప‌టి స్నేహితురాలు. అయితే పెళ్ల‌య్యాక ఒకే టీంలో ఉంటోన్న టైంలో ఆమెకు ముర‌ళీ విజ‌య్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డి ఎఫైర్‌కు దారితీసింది. స్నేహితుడు, భార్య క‌లిసి చేసిన మోసానికి దినేష్ కార్తీక్ కెరీర్ ఒక్క‌సారిగా త‌ల్ల‌కిందులు అయ్యింది. అయినా ఎంతో క‌ష్ట‌ప‌డి మ‌ళ్లీ జాతీయ జ‌ట్టులోకి వ‌చ్చాడు. ఇక కార్తీక్‌కు విడాకులు ఇచ్చాక నిఖిత్ విజ‌య్‌ను పెళ్లాడింది.

5- వెంక‌టేష్ ప్ర‌సాద్ :
టీం ఇండియా మాజీ క్రికెట‌ర్ , ఫేస్ బౌల‌ర్ వెంక‌టేష్ ప్ర‌సాద్ సైతం ఓ డైవ‌ర్సీ అమ్మాయినే పెళ్లాడాడు. 1996లో వెంక‌టేష్ ప్ర‌సాద్ జ‌యంతి అనే మ‌హిళ‌ను పెళ్లాడాడు. ఆమెకు అప్ప‌టికే మొద‌టి భ‌ర్త‌తో విడాకులు అయిపోయాయి. విచిత్రం ఏంటంటే ఓ డైవ‌ర్సీ అమ్మాయిని పెళ్లాడిన అనిల్ కుంబ్లే ద్వారా వీరిద్ద‌రు ఫ్రెండ్స్ అయ్యి… త‌ర్వాత భార్య భ‌ర్త‌లు అయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news