Moviesహరీష్ శంకర్ ను తిట్టిన స్టార్ హీరోయిన్.. మర్చిపోలేని వార్నింగ్..?

హరీష్ శంకర్ ను తిట్టిన స్టార్ హీరోయిన్.. మర్చిపోలేని వార్నింగ్..?

హరీష్ శంకర్..ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎవ్వరి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి..తాను కలలు కన్న హీరోలతో సినిమాలు చేస్తూ..వాళ్ళని డైరెక్ట్ చేస్తూ..అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇండస్ట్రీలో కి రావడం అంటే ఆషామాషీ విషయం కాదు. దానికి ఎంతో కృషి, పట్టుదల ఉండాలి. అది కూడా ఎవ్వరి హెల్ప లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి..స్టార్ డైరెక్టర్ అవ్వడం అంటే అది గొప్ప విషయమే..దాని కి ఎంతో కష్టం, పట్టుదల,ఓర్పు, టాలెంట్ ఉండాలి. ఒక్కోసారి ఒక్క సినిమా దర్శకత్వం వహించే ఛాన్స్ ఒక జీవితకాలం ఎదురుచూసినా అది రాకపోవచ్చు. అలాంటిది సినీ పరిశ్రమ. ఆలాంటి సినీ పరిశ్రమలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు దర్శకుడు హరీష్ శంకర్.

రవితేజ హీరో గా నటించిన వీడే’, ‘నా ఆటోగ్రాఫ్’ సినిమాలకు మొదటగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఈయన..ఆ తరువాత అదే హీరో రవితేజ ని పెట్టి మాస్ హీరోగా ఘాటెక్కించే సినిమా ‘మిరపకాయ’ తో మొదటిసారిగా డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించి దర్శకుడిగా కూడా హరీష్ శంకర్ కు మంచి పేరు తెచ్చిపెట్టడంతో..ఇక అవకాశాల్య్ క్యూ కట్టాయి. దీంతో ఈసారి ఏకంగా పవన్ కల్యాణ్తో ‘గబ్బర్ సింగ్’ అంటూ పవర్ ఫుల్ బ్లాక్ బస్టర్ అందించాడు. ఈ సినిమా పవన్ కెర్రిర్ కు బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.

ఈ సినిమాలో పవన్ సరసన్ హీరోయిన్ గా స్టార్ డాటర్ కమల్ హాసన్ కూతురు నటించింది. అప్పటి వరకు అమ్మదు బోలెడు సినిమాల్లో నటించిన ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. ఇక ఈ సినిమాతోనే కెరీర్ లో ఫస్ట్ హిట్ సినిమాను రుచి చూసింది. అయితే, ఈ సినిమా షూటింగ్ టైంలో డైరెక్టర్ హరీష్ శంకర్..శృతి ని..కమల్ హాసన్ గారు తినే ఫుడ్ గురుంచి..ఇంట్లో ఎలా ఉంటారు.. డైరెక్షన్ చేసే సమయంలో ఎలా ఉంటారు.. ఏం తింటారు.. మీ డైట్ ఏంటి.. ఇలా అనేక ప్రశ్నలతో శ్రుతి హాసన్‌ను విసిగించేవాడట. వన్ ఫైన్ డే ఇవ్వన్ని భరించలేక శృతి..”దయచేసి, పప్ప గురించి కాకుండా ఇంకెమైన మాట్లాడండి” అంటూ తిట్టేసిందట. ఈ విషయాని స్వయానా హరీష్ శంకర్ నే కమల్ హాసన్ విక్రమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పుకొచ్చారు. దీంతో ఆయన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news