Movies15 రోజులకు 50 కోట్లు..హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరో...

15 రోజులకు 50 కోట్లు..హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరో రెమ్యూనరేషన్..?

ఈ మధ్య కాలంలో సినిమా హిట్ అయిన ఫట్ అయినా..హీరో, హీరోయిన్లు మాత్రం తమ రెమ్యూనరేషన్ లని పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు మన టాలీవుడ్ హీరోలు అందరు కూడా ఒక్కో సినిమాకు 50 కోట్లు పారితోషకం పైగానే పుచ్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ 100 కోట్లు తీసుకుంటుంటే..అల్లు అర్జున్, తారక్, చరణ్, లాంటి వాళ్లు 70-80 మధ్య రేంజ్ లో పారితోషకం పుచ్చుకుంటున్నారు. చిరంజీవి, నాగార్జున, పవన్ కల్యాన్, లాంటి వాళ్ళు 50-60 మధ్యలో కొనసాగుతున్నారు.

అయితే, ఈ మధ్య కాలంలో పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్ పెంచత్లేదు కానీ..కాల్ షీట్లను తగ్గించేస్తూ అదే పారితోషకాని పుచ్చుకుంటున్నారు. నిజానికి భీంలా నాయక్ సినిమా టైం లో కూడా పవన్ కాల్ షీట్లు తగ్గువుగా కేటాయించారనే టాక్ బయటకి వచ్చింది. కానీ, లాస్ట్ సినిమా షెడ్యూల్స్ కంప్లీట్ అవ్వక..మరికొన్నింటిని యాడ్ చేశారట. కానీ రెమ్యూనరేషన్ మాత్రం 60 కోట్లు తీసుకున్నట్లు టాక్ వినిపించింది.

ప్రజెంట్ అటు రాజకీయాలు..ఇటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్న పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి..రెండు షూటింగ్ దశలో ఉండగా..మరో రెండు షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. రీసెంట్ గానే తమిళ మూవీ రీమేక్ కు ఓచ్చ జెండా ఊపిన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ వినోదయ సిత్తం రీమేక్ చేయనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతుండగా..ఈ సినిమా కోసం పవన్ కేవలం 15 రోజుల కాల్ షీట్లు మాత్రమే ఇచ్చాడని..దాని కోసం కూడా 50 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడనే వార్త నెట్టింట తెగ వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news