Moviesవిశ్వ‌క్‌సేన్ ప్రాంక్ వీడియోకు బాబురా ఇది... ' సాఫ్ట్ వేర్ బ్లూస్‌...

విశ్వ‌క్‌సేన్ ప్రాంక్ వీడియోకు బాబురా ఇది… ‘ సాఫ్ట్ వేర్ బ్లూస్‌ ‘ కు అదిరే ప్ర‌మోష‌న్ (వీడియో)

తెలుగు సినిమా రంగంలో ఇటీవ‌ల టాలెంట్ ఉంటే చాలు స‌క్సెస్ అవుతోన్న వారు ఎంతో మంది ఉంటున్నారు. ముఖ్యంగా యువ‌త అయితే సోష‌ల్ మీడియాలో త‌మ టాలెంట్‌ను ఫ్రూవ్ చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఎంతో మంది అమ్మాయిలు, అబ్బాయిలు యువ‌త సోష‌ల్ మీడియాతో త‌మ టాలెంట్ ఫ్రూవ్ చేసుకుని సెల‌బ్రిటీలు అవుతున్నారు.

ఒక‌ప్పుడు స్టార్ అవ్వాలంటే మీడియా స‌పోర్ట్ ఉండాలి.. ఈ రోజు సోష‌ల్ మీడియా స‌పోర్ట్ ఉంటే చాలు వాళ్లంత‌ట వాళ్లే దూసుకుపోతున్నారు. ఒక‌ప్పుడు ఎంత మంచి క‌థ‌తో సినిమా తీసినా కూడా పెద్ద పెద్ద మీడియా సంస్థ‌లు సపోర్ట్ చేయ‌క‌పోతే ఆ సినిమా జ‌నాలు, ప్రేక్ష‌కుల‌కు రీచ్ అయ్యేదే కాదు. ఇప్పుడు అవ‌న్నీ లేవు.. త‌మ‌లో స‌త్తా ఉంటే చాలు త‌మ కంటెంట్‌తో ఎన్నోన్నో అద్భుతాలు చేస్తున్నారు.

ఇటీవ‌ల వ‌చ్చిన యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్ అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం సినిమా ప్ర‌మోష‌న్ల‌ను పెద్ద మీడియా సంస్థ‌లు ప‌ట్టించుకోలేదు. అయితే ఈ సినిమా హీరో విశ్వ‌క్‌సేన్ త‌న టీంతో చేసిన ఒకే ఒక్క ఫ్రాంక్ వీడియో సినిమాకు కావాల్సినంత ప్ర‌మోష‌న్ తెచ్చిపెట్టింది. వాస్త‌వానికి ఓ ప్ర‌ముఖ టీవీ ఛానెల్ కాంట్ర‌వ‌ర్సీ చేసి సినిమాకు మ‌రింత హైప్ తెచ్చిపెట్టింది.

ఆ వీడియో సోష‌ల్ మీడియాలో ఎంత ర‌చ్చ‌లేపిందో.. విశ్వ‌క్‌సేన్‌కు ఎంత ప‌బ్లిసిటీ తెచ్చిపెట్టిందో చూశాం. ఇక ఇప్పుడు అదే త‌ర‌హాలో మ‌రో సినిమా కోసం చేసిన ఫ్రాంక్ వీడియో కూడా సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. సాఫ్ట్ వేర్ బ్లూస్ అనే తన మూడో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు యంగ్ హీరో శ్రీరామ్ నిమ్మ‌ల‌. ఉమా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భావ‌న హీరోయిన్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ఈ నెల 24న రిలీజ్ అవుతోంది.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తూనే ఏకంగా మిలియ‌న్ వ్యూస్ సొంతం చేసుకుంది. సినిమాలో యూత్‌ను ఆక‌ట్టుకునే కంటెంట్‌తో పాటు ప్రేమ‌, కామెడీ, సెంటిమెంట్‌ను మిక్స్ చేశారు. దీంతో కంటెంట్‌కు అంద‌రూ క‌నెక్ట్ అవుతున్నారు. ట్రైల‌ర్ చూస్తుంటే సినిమాలో ఏదో విష‌యం ఉన్న‌ట్టుగానే తెలుస్తోంది.

తాజాగా హీరో, హీరోయిన్ ఇప్పుడు ఫ్రాంక్ వీడియో చేసి నానా ర‌చ్చ చేశారు. ప్ర‌మోష‌న్లో భాగంగానే ఫ్రాంక్ వీడియో షూట్ చేస్తుంటే ఓ వ్య‌క్తి వ‌చ్చి వీడియోలు తీయొద్ద‌ని నానా గొడ‌వ చేస్తాడు. చివ‌ర‌కు ఇద్ద‌రూ క‌లిసి క‌ల‌బ‌డ‌డంతో పాటు చొక్కాలు చించుకునే వ‌ర‌కు వ‌చ్చేసింది. మ‌ధ్య‌లో వారిని విడ‌దీసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ఈ ఫ్రాంక్ వీడియోలో కాస్త బూతులు కూడా వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వీడియో హీరో శ్రీరామ్ నిమ్మ‌ల సినిమా సాఫ్ట్ వేర్ బ్లూస్‌కు ఎంత ప్ల‌స్ అవుతుందో ? చూద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news