Moviesనాగ‌చైత‌న్య‌తో డేటింగ్ వార్త‌ల‌పై స్పందించిన శోభిత ధూళిపాళ‌... షాకింగ్ ఆన్స‌ర్‌...!

నాగ‌చైత‌న్య‌తో డేటింగ్ వార్త‌ల‌పై స్పందించిన శోభిత ధూళిపాళ‌… షాకింగ్ ఆన్స‌ర్‌…!

న‌టుడు అడ‌వి శేష్‌తో క‌లిసి చేసిన సినిమాల‌తో బాగా పాపుల‌ర్ అయ్యింది శోభిత ధూళిపాళ‌. అడవి శేష్ గూఢ‌చారి, తాజాగా వ‌చ్చిన మేజ‌ర్ సినిమాల్లోనూ శోభిత న‌టించింది. ఈ రెండు సినిమాల్లోనూ శోభిత పాత్ర‌లు బాగా క్లిక్ అయినా కూడా ఆమెకు అనుకున్నంత పేరు అయితే రాలేదు. ఇత‌ర హీరోల సినిమాల్లో ఆమెకు ఛాన్సులు రాలేదు. ఇటు మీడియాలోనూ హైలెట్ కాలేదు. విచిత్రంగా అక్కినేని నాగ‌చైత‌న్య‌తో ఆమె డేటింగ్‌లో ఉందంటూ వ‌చ్చిన వార్త‌ల‌తో శోభిత ధూళిపాళ పేరు బాగా వార్త‌ల్లో న‌లుగుతోంది.

నాగ‌చైత‌న్య , శోభిత డేటింగ్‌లో ఉన్నార‌ని… త్వ‌ర‌లోనే వీరు పెళ్లి చేసుకున్నా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదున్న ప్ర‌చారం గ‌ట్టిగా జ‌రుగుతుండ‌డంతో అటు స‌మంత కూడా దీనిపై స్పందించింది. తాము త‌మ ప‌నుల్లో హ్యాపీగా ఉన్నాం.. మీరు ఆపండి అంటూ ఈ రూమ‌ర్లు స్ప్రెడ్ చేసేవాళ్ల‌కు కౌంట‌ర్ ఇచ్చింది. ఇక ఇటు శోభిత – చైతు ప‌దే ప‌దే ముంబైలో మీట్ అవుతున్నార‌ని.. హోట్స‌ల్స్‌, రెస్టారెంట్ల‌లో క‌నిపిస్తున్నారంటూ ముందుగా ముంబై మీడియా క‌థ‌నం ప్ర‌చురించింది.

ఆ త‌ర్వాత ఈ క‌థ‌నం ఆధారంగా తెలుగు మీడియాలోనూ వీరి డేటింగ్ వార్త‌లు పుంకాను పుంకాలుగా వ‌చ్చేశాయి. అయితే ఈ వార్త‌ల‌పై చైతు, శోభిత ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రూ స్పందించ‌లేదు. ఈ వార్త‌ల‌పై న‌ష్టం జ‌రిగే ప్ర‌మాదం ఉండ‌డంతో శోభిత తాజాగా స్పందించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆమె ఓ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో ఆమె మిడిల్ ఫింగ‌ర్ చూపిస్తూ త‌న‌పై వ‌స్తోన్న వార్త‌లు అన్నింటికి చెక్ పెట్టారు.

చైతుతో డేటింగ్ వార్త‌ల‌పై ప‌రోక్షంగా స్పందించిన శోభిత ఇలా కౌంట‌ర్ ఇచ్చార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక ఈ వార్త‌ల‌పై చైతు మాత్రం స్పందించ‌లేదు. చైతు త‌న ప‌నుల్లో తాను బిజీగా ఉన్నాడు. అటు ఈ రూమ‌ర్ల‌పై శోభిత‌, స‌మంత ఇద్ద‌రూ స్పందించినా చైతు షూటింగ్‌లు చేసుకుంటున్నార‌డు. చైతు బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్‌తో న‌టించిన లాల్‌చ‌ద్దా ఆగస్టు 12న వ‌స్తోంది.

ఇక దిల్ రాజు బ్యాన‌ర్లో విక్ర‌మ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన థ్యాంక్యూ సినిమా సైతం జూన్ మూడో వారంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఇప్ప‌టికే నాలుగు వ‌రుస హిట్ల‌తో ఉన్న చైతు విడాకుల ప్ర‌భావం త‌న‌పై లేకుండా జాగ్ర‌త్త‌గా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news