Moviesకాపీ విత్ క‌ర‌ణ్‌... విడాకుల‌పై సంచ‌ల‌న నిజాలు చెప్పిన స‌మంత‌...!

కాపీ విత్ క‌ర‌ణ్‌… విడాకుల‌పై సంచ‌ల‌న నిజాలు చెప్పిన స‌మంత‌…!

అక్కినేని మాజీ కోడ‌లు స‌మంత విడాకుల త‌ర్వాత జెట్ రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. విడాకుల త‌ర్వాత బోల్డ్‌గా రెచ్చిపోయే విష‌యంలో స‌మంత ఏ మాత్రం త‌గ్గేదేలే అన్న‌ట్టుగా ఉంటోంది. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్‌లో ఆమె ఎంత‌లా రెచ్చిపోయిందో మ‌నం చూశాం. ఇప్పుడు బాలీవుడ్‌లో బోల్డ్ వెబ్‌సీరిస్‌లు కూడా చేస్తోంది.

టాలీవుడ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా ఖుషీ సినిమాలో కూడా న‌టిస్తోంది. ఇవ‌న్నీ ఇలా ఉంటే విడాకుల‌కు నాలుగు నెలల ముందు నుంచే స‌మంత సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల సందేహాలు వ‌చ్చేలా పోస్టులు పెడుతూ వ‌చ్చింది. స‌మంత ఆ పోస్టులు పెడుతున్న‌ప్పుడే చైతుకు ఆమె దూరంగా ఉండ‌డంతో ఏదో సందేహం వ‌చ్చేసింది. చివ‌ర‌కు అంద‌రి అంచ‌నాలు నిజం చేస్తూ ఆమె చైతుతో విడిపోయింది.

విడాకుల త‌ర్వాత కూడా పెడుతోన్న మెసేజ్‌లు చూస్తుంటే అక్కినేని ఫ్యామిలీలో ఆమె ప‌డిన ఇబ్బందుల‌తో పాటు ఏదో తెలియ‌ని పెయిన్ అనుభ‌వించింద‌న్న సందేహాలు అంద‌రిలోనూ క‌లిగాయి. అయితే విడాకుల‌కు గ‌ల కార‌ణం ఏంట‌న్న‌ది ఆమె బ‌హిరంగంగా మాత్రం ఎప్పుడూ చెప్ప‌లేదు. అయితే ఇప్పుడు త‌న విడాకుల‌పై ప్ర‌ముఖ పాపుల‌ర్ టాక్ షో కాపీ విత్ క‌ర‌ణ్‌లో ఆమె బాంబు పేల్చిన‌ట్టు తెలుస్తోంది.

నార్త్‌లో ప్రముఖ పాపుల‌ర్ టాక్ షో అయిన కాపీ విత్ క‌ర‌ణ్‌లో స‌మంత పాల్గొంది. త్వ‌ర‌లో ప్రారంభ‌మ‌య్యే సీజ‌న్ 7లో ప‌లువురు టాలీవుడ్ న‌టులు పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ నుంచి స‌మంత పాల్గొన్న ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ ఎపిసోడ్‌లో చైతుతో విడాకుల గురించి బిగ్ బాంబ్ పేల్చ‌డంతో పాటు చాలా సంచ‌ల‌న విష‌యాలు కూడా స‌మంత బ‌య‌ట పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది.

స‌మంత కొన్ని సంచ‌ల‌న విష‌యాలు చెప్పింద‌న్న మ్యాట‌ర్ బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు అంద‌రిలోనూ ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్ర‌సారం అవుతుందా ? అన్న ఉత్కంఠ అయితే ఉంది. చైతు, అక్కినేని ఫ్యామిలీ గురించి ప‌రోక్షంగా ఆమె ఘాటుగానే టార్గెట్ చేసిన‌ట్టు చెపుతున్నారు. మ‌రి స‌మంత ఏ బాంబు పేల్చింద‌న్న‌ది ఎపిసోడ్ బ‌య‌ట‌కు వ‌స్తే కాని తెలియ‌దు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news