Moviesబోయపాటి - రామ్ సినిమాలో బాల‌య్య రోల్ ఇంత ఇంట్ర‌స్టింగా...!

బోయపాటి – రామ్ సినిమాలో బాల‌య్య రోల్ ఇంత ఇంట్ర‌స్టింగా…!

బోయపాటి – బాలయ్య కాంబినేషన్ అంటేనే నందమూరి అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. సింహా, లెజెండ్ తరువాత ఇటీవల వచ్చిన అఖండ ఎంతటి ఘన విజయం సాధించిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. అఖండ ఇచ్చిన జోష్ తో బోయపాటి, ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ తో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం రామ్ లింగుసామి డైరక్షన్ లో ‘ది వారియర్’ సినిమా చేస్తున్న విషయం తెలిసినదే. ఆ సినిమా పూర్తి కాగానే బోయపాటి మూవీ సెట్స్ మీదకు వెళ్తుంది. అయితే ఈ సినిమా గురించి ఓ పుకారు ఫిలిం నగర్లో చక్కెర్లు కొడుతోంది.

అసలు విషయం ఆ పరమేశుడికెరుక గాని, ఆ విషయం తెల్సినప్పటినుండి నందమూరి అభిమానులను అసలు ఆపలేకపోతున్నాం. ఇంతకీ ఆ విషయం ఏమిటని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. రామ్ తో బోయపాటి శ్రీను చేస్తున్న సినిమాలో బాలయ్య బాబు కూడా ఉంటాడని ఓ పుకారు షికారు చేస్తోంది. అదేంటి బోయపాటి శ్రీను మల్టీస్టారర్ ఏదైనా చేస్తున్నాడా అని అనుకుంటే పొరపాటే సుమా. ఎందుకంటే ఆ సినిమాలో బాలయ్య బాబు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కనబడనున్నాడట.

అదేనండి… ఈ సినిమాలో బాలయ్య కామియో అంటే.. సినిమాలో బాలకృష్ణ ఉండడు కాని ఆయన రిఫరెన్స్ మాత్రం ఉంటుందని అంతా అనుకుంటున్నారు. ఇంతకీ ఆ రిఫరెన్స్ ఏమంటే, జై బాలయ్య అనే పదాన్ని వాడుతున్నారని తెలుస్తుంది. బోయపాటి తన సినిమాలో బాలయ్య రిఫరెన్స్ వాడి నందమూరి ఫ్యాన్స్ టార్గెట్ చేయాలని చూస్తున్నాడని భోగట్టా. రామ్ ది వారియర్ సినిమా ఆల్రెడీ పూర్తి అయ్యింది.

ఈ నేప‌థ్యంలోనే త్వరలోనే బోయపాటి శ్రీను సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని రామ్ అభిమానులు ఆశిస్తున్నారు. బోయపాటి మార్క్ యాక్షన్ మూవీగా రామ్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news