Moviesమహేశ్ విషయం లో రాజమౌళి తప్పుచేస్తున్నాడా..తప్పక చేస్తున్నాడా..?

మహేశ్ విషయం లో రాజమౌళి తప్పుచేస్తున్నాడా..తప్పక చేస్తున్నాడా..?

ఎట్టకేలకు రాజమౌళి అనుకున్న పని అనుకున్న విధంగా దిగ్విజయంగా పూర్తి చేశాడు. దాదాపు మూడేళ్ళకు పై గా కష్ట పడి ..ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపి..తెరకెక్కించిన సినిమా RRR..బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా..ఇండియన్ సినిమా చరిత్రలో ఓ ప్రత్యేకమైన స్దానాని దక్కించుకుంది. ఇలా రికార్డ్లు క్రియేట్ చెయ్యడం రాజమౌళికే సాధ్యం అని చెప్పాలి. గతంలో బాహుబలి..ఇప్పుడు RRR ఇలా ఆయన రికార్డులు ఆయనే బద్ధలు కొట్టుకుంటూ వెళ్తున్నారు.

ఇక ఇప్పుడు అందరి కళ్లు రాజమౌళి -మహేశ్ బాబు ప్రాజెక్ట్ పైనే పడ్డాయి. మనకు తెలిసిందే..రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకున్న ఈయన..ఆ తరువాత..త్రివిక్రమ్ సినిమాలో నటించదానికి రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమా పూర్తి అవ్వగానే..సెకండ్ కూడా ఆలస్యం చెయ్యకుండా..రాజమౌళి సినిమా ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు మహేశ్. ఈ సినిమా కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఆల్ మోస్ట్ పూర్తైయ్యిన్నట్లు తెలుస్తుంది. ఆఫ్రికా అడవుల నేపధ్యంలో ఈ సినిమా స్టోరీ ఉండబోతుందట.

అయితే, ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించాలని చూస్తున్న రాజమౌళి..హీరోయిన్ విషయం లో కన్ ఫ్యూజ్ అవుతున్నాడట. మహేశ్ పక్కన హీరోయిన్ అంటే హైట్ ఉండాలి. ఆయన అందం ముందు తేలిపోకుండా ఉండాలి. ముఖ్యంగా మహేశ్ అందాని బీట్ చేసే అమ్మాయి అయితే..గ్లామరస్ గా కూడా వర్క్ అవుట్ అవుతుంది. అందుకే..రాజమౌళి ఈ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీస్ ని దింపబోతున్నారట.

ఇప్పటికే ముగ్గురు భామలను అప్రోచ్ అయ్యిన రాజమౌళి..ఫైనల్ గా ప్రభాస్ బ్యూటీని ఫిక్స్ చేశారట. సాహో సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధాకపూర్‌ ని రాజమౌళి హీరోయిన్ గా ఫైనల్ చేసిన్నత్లు తెలుస్తుంది. శ్రద్ధాకపూర్ హిందీలో మంచి క్రేజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. కానీ, తెలుగులో సాహో ఫ్లాప్ అయ్యాక ఆమెకు అవకాశాలు దక్కలేదు. కాగా, ఇప్పుడు రాజమౌళి పిలిచి అవకాశం ఇస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే, మహేశ్ పక్కన శ్రద్ధా కపూర్ అంతగా సెట్ అవ్వదు అన్న మాటలు వినిపిస్తున్నాయి. అలియా భట్ అయితే బాగుంటుందని టాక్ బయట వినిపిస్తుంది. దీంతో రాజమౌళి ఏం చేస్తాడో అన్న టెన్షన్ అందరిలోను ఉంది..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news