Movies# NTR 30 ఎన్టీఆర్ 30వ ప్రాజెక్టుపై అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చేసింది......

# NTR 30 ఎన్టీఆర్ 30వ ప్రాజెక్టుపై అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చేసింది… !

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో త‌న 30వ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్‌తో త‌న కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం డ‌బుల్ హ్యాట్రిక్ హిట్లు సొంతం చేసుకున్నాడు. టెంప‌ర్ నుంచి త్రిబుల్ ఆర్ వ‌ర‌కు అస‌లు ఎన్టీఆర్‌కు ప్లాప్ అన్న‌దే లేదు. ఇలాంటి ఫుల్ ఫామ్‌లో ఉన్న ఎన్టీఆర్ నెక్ట్స్ లైన‌ప్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ప్లాన్ చేసుకుంటున్నాడు.

త‌న 30వ సినిమాను కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న ఎన్టీఆర్ ఆ వెంట‌నే 31వ ప్రాజెక్ట్‌ను కేజీయ‌ఫ్‌, స‌లార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో చేస్తున్నాడు. ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులు కూడా పాన్ ఇండియా లెవ‌ల్లో తెర‌కెక్కుతున్నాయి. ఇక ముందుగా వ‌చ్చే కొర‌టాల శివ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ టీజ‌ర్ రిలీజ్ అవ్వ‌గా దీనికి పాన్ ఇండియా లెవ‌ల్లో అదిరిపోయే రెస్పాన్స్ అయితే వ‌చ్చింది.

అయితే ఈ సినిమా ఇంకా ప‌ట్టాలు ఎక్క‌లేదు. అయితే సినిమా మాత్రం ఇంకా ప‌ట్టాలు ఎక్క‌లేదు. మ‌రోవైపు ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా ఎప్పుడు పట్టాలు ఎక్కుతుంది… ఈ యేడాది థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా ? క‌నీసం వ‌చ్చే యేడాది సంక్రాంతి, స‌మ్మ‌ర్‌కు అయినా రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయా ? అన్న ఆందోళ‌న‌లో ఉన్నారు.

అస‌లే ఎన్టీఆర్‌ను నాలుగేళ్ల త‌ర్వాత త్రిబుల్ ఆర్ సినిమాతో… అది కూడా మ‌రో హీరోతో క‌లిసి మాత్ర‌మే వెండితెర మీద చూశారు. మ‌ళ్లీ ఇప్పుడు అయినా చ‌క‌చ‌కా సినిమాలు చేస్తాడ‌ని అనుకుంటే… ఇప్పుడు కూడా ఆల‌స్యం అవుతుండ‌డంతో నంద‌మూరి ఫ్యాన్స్ డిజ‌ప్పాయింట్‌లో ఉన్నారు. కొర‌టాల శివ సినిమా అదిగో ఇదిగో అంటున్నా ఇంకా ప‌ట్టాలు ఎక్క‌డ‌మే లేదు.

అయితే దీనిపై ఎట్ట‌కేల‌కు అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చింది. దర్శకుడు కొరటాల శివ ఆచార్య ప్లాప్ కావ‌డంతో ఆ బిజినెస్ డీల్స్ సెటిల్ చేసే ప‌నుల్లో బిజీ ఉన్నార‌ట‌. అది పూర్త‌యిన వెంట‌నే ఎన్టీఆర్ సినిమాను జూలై ఎండింగ్ లేదా ఆగ‌స్టు నుంచి సెట్స్ మీద‌కు తీసుకువెళ‌తార‌ని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news