Moviesఅనిల్ కి హిట్ పొగరు వచ్చేసింది..హీట్ పెంచేసిన డైరెక్టర్ మాటలు..!!

అనిల్ కి హిట్ పొగరు వచ్చేసింది..హీట్ పెంచేసిన డైరెక్టర్ మాటలు..!!

డైరెక్టర్ అనిల్ రావిపూడి పై సొషల్ మీడియా ట్రోలింగ్ ఎక్కువైంది. రీసెంట్ గా F3 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న అనిల్..వరుస ఛానెల్ కి ఇంటర్వ్యు ఇస్తున్నారు. ఈ క్రమంలో నే ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో ఆయన మాట్లాడుతూ..తన గురించి…తను సినిమాలు తీసేటప్పుడు ఎలా ఉండారు అనే దాని గురించి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే F3 సినిమా టైంలో హీరోయిన్ తమన్నా తో జరిగిన గోడవ పై స్పందించాడు.

పెద్ద గొడవ కాదు..చిన్న విషయమే అంటూ పెద్ద స్టోరీనే చెప్పాడు. “సినిమా షూటింగ్ టైంలో నైట్ లేట్ అయ్యింది. జనరల్ గా ముంబై లో అయితే షూటింగ్ టైంస్ ఎక్కువగా ఉంటాయని..కానీ, మన తెలుగు నిర్మాతలు దేవుళ్లు..చాలా అర్ధంచేసుకుంటారు. ఒక్కరోజు సినిమా షూట్ లేట్ అయ్యింది.. ఈక్రమంలోనే తమన్నా వెళ్ళాలి అని పట్టుబట్టింది. వాళ్లకి ఉంటాయి గా మార్నింగ్ జిమ్ లు..ఆ టైంలో అలా రెండు రోజులు హీట్ ఉన్నింది..అంతే”..అంటూ చెప్పుకొచ్చారు.

అయితే, ఈ మాటలు తమన్నా ఫ్యాన్స్ కి హర్టింగ్ గా అనిపించాయట. కావాలనే తమన్నాని నెగిటీవ్ చేయకుండానే అనిల్ మాటలు ఆమెను తప్పు పట్టేలా ఉన్నాయి అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు, అనిల్ మాట్లాడుతూ…F4 సినిమా ఉంటుందని..ఖచ్చితంగా నా సినిమాలో ఈ హీరోయిన్ ఉండరని చెప్పుకొచ్చాడు. దీంతో కొందరు ఆయనని టార్గెట్ చేస్తూ..వరుస సినిమాలు హిట్ అవుతుంటే..ఆ హెడ్ వెయిట్ పెరిగింది అనిల్ కి అంటూ ట్రోల్ చేస్తున్నారు. అందుకే ఇలా ఓవన్ కాన్ ఫిడెన్స్ పెరిగిపోయిందంటూ మండిపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news