MoviesNBK 107: అఖండ సెంటిమెంట్ ఫాలో అవుతోన్న బాలయ్య..?

NBK 107: అఖండ సెంటిమెంట్ ఫాలో అవుతోన్న బాలయ్య..?

అఖండ సెంటిమెంట్ ఫాలో కాబోతున్న బాలయ్య..? అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త వచ్చి వైరల్ అవుతోంది. బాలయ్య ప్రస్తుతన్ తన 107వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. బాలయ్య శైలికి ఏమాత్రం తగ్గకుండా గోపీచంద్ మలినేని మార్క్ యాక్షన్ సినిమాగా ఇది రూపొందుతోంది. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ ట్రీట్ నందమూరి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఖచ్చితంగా బాలయ్య గత చిత్రం అఖండ ఊహించని విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు గత ఏడాది డిసెంబర్‌లో రిలీజై బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామీని సృష్ఠించింది. చెప్పాలంటే బాలయ్య రేంజ్‌కు పెట్టాల్సిన బడ్జెట్ కాదు. అంత తక్కువ బడ్జెట్ కేటాయించారు. బాలయ్య సూచన మేరకే సినిమా బ‌డ్జెట్ పెట్ట‌డం.. ప్రి రిలీజ్ బిజినెస్ జ‌ర‌గ‌డంతో అఖండ‌కు అదిరిపోయే లాభాలు వ‌చ్చాయి.

అయితే ఇప్పుడు మ‌లినేని గోపీ సినిమాకు మాత్రం భారీ బ‌డ్జెట్ పెడుతున్నారు. ఈ ఎన్‌బీకే 107 ఈ ఏడాది దసరా బరిలో దింపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ, తాజా సమాచారం మేరకు బాలయ్య అఖండ సినిమా సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ మళ్ళీ తన 107వ సినిమాను కూడా డిసెంబర్‌లోనే రిలీజ్ చేసేలా మేకర్స్‌కు సూచించారట. చెప్పాలంటే ఇప్పటివరకు పెద్ద సినిమాలేవీ డిసెంబర్‌లో రిలీజ్ అవుతున్నట్టు అప్‌డేట్ లేదు.

ఒక‌వేళ పెద్ద సినిమాలు ఉన్నా బాలయ్యకు ఏమీ సమస్యలుండవు. గత ఏడాది పుష్ప సినిమా ఉన్నా..అది పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజైనా బాలయ్య అఖండ వసూళ్ళు గురించి ఇంకా చెప్పుకుంటున్నారు. కాబట్టి డిసెంబర్‌లో ఏ పాన్ ఇండియా సినిమా రిలీజైనా బాలయ్య అనుకుంటే తన 107ను రిలీజ్ చేయడానికి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయరు. చూడాలి మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్‌మేషన్ ఎప్పుడొస్తుందో.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news