Moviesస‌మంత బాట‌లోనే నిహారిక‌.. పెళ్లైనా ఈ ప‌నులు ఎందుకో..!

స‌మంత బాట‌లోనే నిహారిక‌.. పెళ్లైనా ఈ ప‌నులు ఎందుకో..!

మెగా డాటర్ నిహారిక పెళ్ల‌య్యాక కూడా సోష‌ల్ మీడియాలో హాట్‌గా ద‌ర్శ‌నమిస్తూనే ఉంటోంది. అయితే పెళ్ల‌య్యాక ఒక‌టి రెండు సార్లు నిహారిక‌, ఆమె భ‌ర్త జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య ఇద్ద‌రూ కూడా కాంట్ర‌వ‌ర్సీ వార్త‌ల‌తో వార్త‌ల్లోకి ఎక్కారు. ఇక పెళ్ల‌యినా కూడా నిహారిక మాత్రం గ్లామ‌ర్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేసే విష‌యంలో ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. ఇక పెళ్లికి ముందు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఆ సినిమాలు అనుకున్న‌ట్టుగా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో కొన్ని వెబ్‌సీరిస్‌లు కూడా చేసింది.

బ‌ల‌మైన మెగా ఫ్యామిలీ అండ‌దండ‌లు ఉన్న నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే విష‌యంలో మెగా ఫ్యామిలీతో పాటు మెగాభిమానుల నుంచే కొన్ని సందేహాలు వ‌చ్చాయి. అయితే వాటిని ప‌ట్టించుకోకుండా నిహారిక సినిమాల్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేసింది. ఒక మనసు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ సినిమాలతో ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకున్నా అవి ప్లాప్ కావ‌డంతో ఆమెకు హీరోయిన్‌గా నిరాశ త‌ప్ప‌లేదు.

పెళ్లి త‌ర్వాత నిహారిక చాలా బిజినెస్‌ల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే నిర్మాత‌గా మారి వెబ్‌సీరిస్‌లు కూడా చేస్తోంది. ప్ర‌స్తుతం ఆమె ఓ వెబ్‌సీరిస్‌లో న‌టిస్తోంది. టాలెంట్ ఉన్న యువ‌త‌తో వెబ్‌సీరిస్‌లు త‌న నిర్మాణంలో నిర్మించేందుకు కూడా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఇక నిహారిక తాజాగా సోష‌ల్ మీడియాలో అప్‌డేట్ చేసే గ్లామ‌ర్ ఫొటోల‌కు యువ‌త ఫిదా అయిపోతున్నారు.

పెళ్ల‌య్యాక స‌మంత ఎలా హాట్‌, బోల్డ్‌నెస్‌తో సోష‌ల్ మీడియాను షేక్ చేసిందో ఇప్పుడు నిహారిక కూడా కాస్త అటూఇటూగా అదే దారిలో వెళుతోన్నట్టుగానే ఆమె గ్లామ‌ర్ ఫొటోలు చూస్తేనే తెలుస్తోంది. ఇండ‌స్ట్రీలో మంచి పేరున్న మెగా కుటుంబానికి చెందిన నిహారిక ఇలా గ్లామ‌ర్ ఫొటోలు ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌ద‌ల‌డం మెగాభిమానుల‌కే న‌చ్చ‌డం లేదు. మ‌రి నిహారిక ఇలా గ్లామ‌ర్ ఒల‌క‌బోయ‌డం క‌న్నా మంచి వెబ్‌సీరిస్‌లు నిర్మించి పేరు తెచ్చుకుంటే మంచిదని ప‌లువురు సూచిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news