Moviesనా పక్కన ఆ హీరోయిన్స్ వద్దు"..రాజమౌళికి షాకింగ్ కండీషన్ పెట్టిన మహేశ్..?

నా పక్కన ఆ హీరోయిన్స్ వద్దు”..రాజమౌళికి షాకింగ్ కండీషన్ పెట్టిన మహేశ్..?

సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఓ అందాల హీరో. ఏజ్ పెరుగుతున్న కొద్ది..తన అందాని కూడా పెంచుకుంటూ పోతున్న స్మార్ట్ హ్యాండ్ సమ్ హీరో. రీసెంట్ గా సర్కారు వారి పాట లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుని..ఫుల్ జోరు మీద ఉన్న మహేశ్..ప్రజెంట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమాకి కమిట్ అయ్యి ఉన్నాడు. ఇప్పటీకే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పై కి వెళ్ళనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల బొమ్మ బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే, ఈ సినిమాను ఆరు నెలలో కంప్లీట్ చేసి..మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో భాగం కానున్నాడు మహేశ్ బాబు. కోట్లాది మంది అభిమానులు కొన్ని ఏళ్ళు గా ఈగర్ గా వెయిట్ చేస్తున్న కాంబో..”రాజమౌళి-మహేశ్”. దర్శకధీరుడు రాజమౌళి ..సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో ఓ సినిమా కావాలని అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. ఫైనల్లీ..ఎట్టకేలకు ఫ్యాన్స్ కోరికను తీర్చేస్తున్నారు రాజమౌళి-మహేశ్. వీళ్ళ కాంబోలో ఓ సినిమా ఉంటుందని అఫిషీయల్ ప్రకటన రానప్పటికి..మీడియా ముఖంగానే రాజమౌళి దీని పై పరోక్షకంగానే చెప్పుకొచ్చారు.

ఇక జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్..ఈ సినిమా స్క్రిప్ట్ అద్దిరిపోతుందని.. మహేశ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లు ..రెండు కధలు అనుకుంటున్నామని..పలు ఇంటర్వ్యుల్లొ చెప్పుకొచ్చారు. అందుతున్న సమాచారం ప్రకారం..మహేశ్ తో రాజమౌళి ఓ అడ్వేంచరస్ మూవీ తీయ్యబోతున్నారట. మొత్తం ఆఫ్రికా అడవుల నేపధ్యంలోనే ఈ సినిమా కధ సాగనున్నట్లు సమాచారం.

అయితే, ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం మహేశ్..రాజమౌళి కి షాకింగ్ కండీషన్ పెట్టిన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మహేశ్ కి జోడీగా రాజమౌళి బాలీవుడ్ బ్యూటీని సెలక్ట్ చేయాలని అనుకుంటున్నారట. దీంతో మ్యాటర్ లోకి ఇన్వాల్వ్ అయిన మహేశ్..”నాకు బాలీవుడ్ బ్యూటీస్ అచ్చు రారు. వాళ్ళతో చేసిన మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఫ్లాప్ అయ్యాయి..సో, ఈ ప్రాజెక్ట్ కి బాలీవుడ్ వాళ్లని తీసుకోకండి” అంటూ చెప్పుకొచ్చారట. దీంతో ఈ ప్రాజెక్ట్ కోసం మరో హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారట రాజమౌళి. ఏది ఏమైన మహేశ్ నిర్ణయంతో రాజమౌళికి పెద్ద తలనొప్పే వచ్చిందంటున్నారు సినీ విశ్లేషకులు..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news