Moviesధనుష్ పై ఆ హీరో ఊహించని కామెంట్స్..అంత మాట అనేశాడు ఏంటి...

ధనుష్ పై ఆ హీరో ఊహించని కామెంట్స్..అంత మాట అనేశాడు ఏంటి రా బాబు..?

కోలీవుడ్ బడా హీరో ధనుష్..తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తన నటనతో , టాలెంట్ తో కోలీవుడ్ లో ఎలాంటి మంచి పేరు సంపాదించుకున్నారో..తెలుగులో కూడా అలాంటి స్దాయికే ఎదిగాడు అని చెప్పవచ్చు. ఈ హీరో ఒకప్పుడు రజనీకాంత్ అల్లుడు అనే సంగతి తెలిసిందే. కానీ,, ఆయన తన కెరీర్ లో ఏనాదు కూడా రజినీకాంత్ పేరు చెప్పుకుని సినిమా అవకాసాలు అందుకోలేదు . సొంత టాలెంట్ తో ..సినిమా సినిమాకి కష్టపడి ..హీరోగా ఎదగాలి అంటే కావాల్సింది కలర్.. పర్సనాలిటీ కాదు. హీరో కావాలంటే కష్టపడ్డాలి.. క్రమశిక్షణ ఉండాలి అని నిరూపించాడు హీరో ధనుష్.


కాగా, సినీ ఇండస్ట్రీలో ధనుష్ కి ఫ్రెండ్స్ చాలా తక్కువ గా ఉన్నారట. బయట కూడా చాలా రిసర్వ్డ్ గా ఉండే టైప్ ఈయన అంటుంటారు ఆయన తో నటించిన నటులు. ధనుష్ కి ఉన్న అతి కొద్ది మంది ఫ్రెండ్స్ లో లవర్ బాయ్ మాధవన్ కూడా ఒకరు. రీసెంట్ గా ఆయన ధనుష్ పై చెసిన కామెట్స్ ఇంటర్నెట్ షేక్ చేస్తున్నాయి. క్షణాలల్లోనే వైరల్ గా మారాయి. మాధవన్… తమిళ్, తెలుగు, హిందీ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నిన్న ఆయన పుట్టిన రోజు. సంతోషంగా 51వ పడిలో అడుగుపెడుతున్న సందర్భంగా స్టార్ సెలబ్రిటీలు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రస్తుతం ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న మాధవన్.. తన డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ అంటే ఎంత పిచ్చి పిచ్చి పిచ్చెక్కించే ఇష్టమో చెప్పిన వీడియో వైరల్ అవుతోంది.

“ఆనంద్ తో పని చేయడం చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఆయన ఒక్కో లైన్ చెప్పుతున్నప్పుడు మనకు తెలియకుండానే గూస్ బంప్స్ వస్తాయి. తను వెడ్స్ మను రిటర్న్స్‌లో నటించినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా..చాలా అదృష్ట వంతుడుగా భావించా..అయితే,ఆ తర్వాత ఆయన సినిమాలకు వరుసగా ధనుష్‌ను సెలెక్ట్ చేయడంతో..నాకు ధనుష్ ని చూస్తే ఈర్ష్య కలుగుతుండేది. అబ్బా…ఆ పాత్రకు నన్ను ఎందుకు సెలక్ట్ చేయలేదు అని బాధ పడేవాడిని” అంటూ చెప్పుకొచ్చాడు మాధవన్. దీంతో ఇంత పెద్ద స్టార్ యాక్టర్ ఇలాగా ఆలోచిస్తాడా..అంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. అయినా కానీ, ఆయన తన మనసులోని మాట ఉన్నది ఉన్నట్లు చెప్పడం కరెక్ట్ నే ..ఈ కాలమలో అలా ఎవ్వరు చేయడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news