Moviesనాగ‌చైత‌న్య‌కు ఆ స్టార్ ప్రొడ్యుస‌ర్ అన్యాయం చేస్తున్నాడా... ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌..!

నాగ‌చైత‌న్య‌కు ఆ స్టార్ ప్రొడ్యుస‌ర్ అన్యాయం చేస్తున్నాడా… ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌..!

అక్కినేని నాగ‌చైత‌న్య త‌న కెరీర్‌లో ఎప్పుడూ లేనంత ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. మ‌జిలీ – వెంకీ మామ – ల‌వ్‌స్టోరీ – బంగార్రాజు సినిమాలు వ‌రుస‌గా హిట్ అయ్యాయి. ఇలా బ్యాక్ టు బ్యాక్ నాలుగు హిట్ల‌తో దూకుడు మీదున్న చైతు వ‌చ్చే నెల‌లో రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వస్తున్నాడు. ముందుగా దిల్ రాజు బ్యాన‌ర్లో తెర‌కెక్కిన థ్యాంక్యూ సినిమాతో జూలైలో వ‌స్తుంటే.. ఆగ‌స్టులో అమీర్‌ఖాన్‌తో న‌టించిన లాల్‌చ‌ద్దా సినిమాతో మ‌ళ్లీ వెంట‌నే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.

ఇక చైతు థ్యాంక్యూ సినిమాకు విక్ర‌మ్ కె. కుమార్ ద‌ర్శ‌కుడు. జూలై 8న ఈ సినిమా వ‌స్తోంది. విక్ర‌మ్ కె. కుమార్ లాంటి బ్రిలియంట్ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌కుడు. దీనికి తోడు దిల్ రాజు లాంటి బ‌డా నిర్మాత బ్యాన‌ర్లో వ‌స్తోంది. మ‌రి ఈ సినిమాకు ప్ర‌మోష‌న్లు ఎలా ఉండాలి హోరెత్తిపోవాలి. అయితే ఈ సినిమా రిలీజ్‌కు గ‌ట్టిగా రెండు వారాలు కూడా లేదు. అయితే ఎక్క‌డా థ్యాంక్యూ ప్ర‌మోష‌న్లు అయితే క‌న‌ప‌డ‌డం లేదు.

ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ వ‌ర్గాలు, ట్రేడ్ వ‌ర్గాల‌కు ఆశ్చ‌ర్యంగా మారింది. థ్యాంక్యూ సినిమా నుంచి ఇప్ప‌టికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేయ‌లేదు. అస‌లు వీటిని ఎవ్వ‌రూ ప‌ట్టించుకున్న‌ట్టుగా కూడా లేదు. మేక‌ర్స్ స‌రైన రీతిలో ప్ర‌మోట్ చేయ‌డం లేద‌ని అక్కినేని అభిమానులు సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతూ త‌మ అస‌హ‌నం కూడా వ్య‌క్తం చేస్తున్నారు.

అంతెందుకు దిల్ రాజు బ్యాన‌ర్లో వ‌స్తోన్న విజ‌య్ వార‌సుడు సినిమాకే ఏకంగా మూడు ఫ‌స్ట్ లుక్‌లు రిలీజ్ చేస్తూ వీటికి భారీ ఎత్తున ప్ర‌మోష‌న్లు చేస్తున్నారు. అస‌లు రామ్‌చ‌ర‌ణ్ – శంక‌ర్ సినిమా గురించి చిన్న అప్‌డేట్ కూడా పెద్ద‌గా ప్ర‌మోట్ చేస్తున్నారు. అంతెందుకు ఇటీవ‌ల వ‌చ్చిన ఎఫ్ 3 సినిమాకు 20 రోజుల ముందు నుంచే ఎంత‌లా ప్ర‌మోష‌న్లు ఊద‌ర‌గొట్టేశారో చూశాం.

కానీ నాగ‌చైత‌న్య నాలుగు వ‌రుస హిట్ల‌తో ఫామ్‌లో ఉన్నాడు. ఇలాంటి టైంలో త‌న బ్యాన‌ర్లో ఓ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ కాంబినేష‌న్లో వ‌స్తోన్న థ్యాంక్యూ సినిమా ప్ర‌మోష‌న్‌ను మేక‌ర్స్ ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదో అర్థం కావ‌డం లేద‌న్న‌దే అక్కినేని అభిమానుల బాధ‌. అస‌లు చైతు జోష్ సినిమాతో ఇదే బ్యాన‌ర్లో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ఆ హీరోత‌నే ఇప్పుడు సినిమా చేస్తున్నాడు అంటే ఖ‌చ్చితంగా హిట్ ఇవ్వాల్సిన బాధ్య‌త దిల్ రాజుపై ఉంది. మ‌రి ఇప్ప‌ట‌కీ అయినా ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌పై దృష్టిపెడితే మంచి హైప్ వ‌స్తుంద‌న్న స‌ల‌హాలు మేక‌ర్స్‌కు వ‌స్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news