Moviesఫస్ట్ టైమ్ అలాంటి పాత్రలో పూజా హెగ్డే..ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా...?

ఫస్ట్ టైమ్ అలాంటి పాత్రలో పూజా హెగ్డే..ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా…?

పూజా హెగ్డే..ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలేస్తున్న టాప్ హీరోయిన్. అందానికి అసూయ పుట్టించే అందం ఆమె సొంతం. తీసిపాడేయాల్సిన నటన కాదు. చ‌క్క‌టి రూపం..అంతకు మించిన తెగింపు. నిర్మాత అడగాలే కానీ…అన్ లిమిటెడ్ ఎక్స్ పోజింగ్ కు సై అంటుంది. అలా చిట్టి పోట్టి డ్రెస్లు వేసి ధైస్ అందాలను చూయించి.. యూత్‌ను పిచ్చెక్కించే విధంగా బికినీలు వేసి..ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. వరుసగా మూడు సినిమా ఫ్లాప్ అయినా..పూజా ఖాతాలో మంచి మంచి ఆఫర్స్ పడుతున్నాయి.


ద‌శాబ్దం క్రింద‌ట ఆమె సౌత్‌లో జీవా ప‌క్క‌న మాస్క్ సినిమా చేసిన‌ప్పుడు ఇదేం హీరోయిన్ అని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు…సీన్ క‌ట్ చేస్తే, ఇప్పుడు ఆమె అడిగిన‌న్ని కోట్లు ఇచ్చి స్టార్ డైరెక్టర్లు ఆమెను తమ సినిమాకి బుక్ చేసుకుంటున్నారు. టాప్ హీరోలు అంద‌రూ కూడా ఆమీఅ కావాలి..అంటూ పట్టుబట్టి త‌మ సినిమాల్లో హీరోయిన్ పెట్టుకుంటున్నారు. దింతో పూజా అయితే ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్‌ను ఏలేస్తోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం పూజా కెరీర్ లో కొత్త రిస్క్ లు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.

 

మనకు తెలిసిందే..డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డ్రీమ్ ప్రాజెక్ట్ “జనగణమన” ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సరవేగంగా ఫినిష్ చేయాలని చూస్తున్నాడు పూరి. పురీ అనుకోవాలగాని..సినిమాను మూడు నేలల్లో కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకోచేస్తాదు. అలాంటి సత్తా ఉన్న మనిషి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ బుట్టబోమ్మ పూజా హెగ్డే నటిస్తుంది. జనగణమన సినిమా ఫుల్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ ప్రాజెక్టు అని టైటిల్ బట్టే అర్ధమైపోతుంది.

అంటే ఈ సినిమాలో ఎక్స్ పోజింగ్, రొమాన్స్ సీన్స్ ఉండవు అనుకోవచ్చు. కాగా, ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర చాలా కొత్తగా ఉండబోతుందన్న టాక్ వినిపిస్తుంది. చాలా పవర్ఫుల్ గా యాక్షన్ తరహాలో ఉంటుందట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..పూజా హీరోలతో సమానంగా మొదటిసారి యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తుందని తెలుస్తుంది. పూజా లో అందాలు మాత్రమే చూసే జనాలు ఈ సినిమాలో తనలోని యాక్షన్ సీన్స్ ని కూడా చూడబోతున్నారనమాట. మరి చూడాలి పూజా ఆశలు ఎంత సక్సెస్ అవుతాయో…?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news