Moviesపవన్ సినిమా లో రొమాంటిక్ బ్యూటీ.. డైరెక్టర్ కి బుర్ర లేదా..?

పవన్ సినిమా లో రొమాంటిక్ బ్యూటీ.. డైరెక్టర్ కి బుర్ర లేదా..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాన్ ..ఓ వైపు పాలిటిక్స్ లో బిజీ గా ఉంటూనే..మరో వైపు సినిమాలు చేస్తూ..రెండింటిని బ్యాలెన్స్ గా నెట్టుకోస్తున్నారు. కానీ ఎక్కువ కాలం ఆయన ఇలా కవర్ చేయలేరు. పవన్ నమ్మిన దానికి పూర్తి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా తనకు ఇష్టమైన రెండింటిలో ఒకటి దూరం పెట్టాల్సిందే. పవన్ అయితే..సినిమాలకు బ్రేక్ వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న “హరి హర వీర మల్లు” సినిమా షూటింగ్ 60 శాతం కంప్లీట్ అయ్యింది. ఆ తరువాత వెంటనే హారీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ రెడీ గా ఉంది. తాజాగా సంచారం ప్రకారం పవన్ మరో తమిళ రీమేక్ సినిమా పై కన్నేశారు అని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. సముద్రఖని దర్శకత్వంలో తమిళ భాషలో రూపొంది ZEE5లో స్ట్రీమింగ్ అయిన ‘వినోదయ సీతమ్’ సినిమా రీమేక్ చేసేందుకు ఒప్పుకున్నారట. ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు సమాచారం.

అయితే, పవన్ ఈ సినిమాను త్వరగా ఫినీష్ చేసేసి..ఇక కొన్నాళ్లు టోటల్ ఫోకస్ రాజకీయాల పై చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ గా కెతిక శర్మ సెలక్ట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. మల్టీ టాలెంటేడ్ సముద్రఖనీ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. అయితే, పవన్ సినిమాలో కెతికను హీరోయిన్ గా సెలక్ట్ చేయడం పై అభిమానులు మండిపడుతున్నారు. ఆయన వయసు ఏంటి ..ఆ పాప ఏజ్ ఏంటి..చూడటానికి కూడా బాగోదు..ఇలాంటి పెయిరింగ్ ఎలా సెట్ చేస్తారు..అస్సలు డైరెక్టర్ కి బుర్ర ఉందా..అంటూ ట్రోల్ చేస్తున్నారు జనాలు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news