Moviesఒక‌ప్ప‌టి హీరోయిన్ సంఘ‌వి ఆ టాప్ డైరెక్ట‌ర్‌ను పెళ్లాడి విడిపోయిందా..!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ సంఘ‌వి ఆ టాప్ డైరెక్ట‌ర్‌ను పెళ్లాడి విడిపోయిందా..!

సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌ముఖ‌ హీరో, హీరోయిన్లు ఎప్పుడు ఎవ‌రితో ప్రేమ‌లో ప‌డుతున్నారో ? ఎప్పుడు విడిపోతున్నారో కూడా అర్థం కావ‌డం లేదు. గ‌త ఏడెనిమిది నెల‌లుగా చూస్తే భార‌తీయ సినిమా రంగంలో ఎంతో మంది ప్రముఖులు చాలా సింపుల్‌గా విడాకులు ఇచ్చేసుకుని.. బ్రేక‌ప్ చెప్పేసుకున్నారు. పాత‌త‌రం, అల‌నాటి త‌రంలో కూడా కొంత‌మంది ప్రేమించుకుని పెళ్లి చేసుకుని విడిపోయిన సంద‌ర్భాలు ఉన్నాయి. 1990 – 1995 వ‌ర‌కు తెలుగు సినిమాను త‌న అంద‌చందాల‌తో ఓ ఊపు ఊపేసింది సంఘ‌వి.

క‌న్న‌డ క‌స్తూరి అయిన సంఘ‌వికి తెలుగులో మంచి అవ‌కాశాలే వ‌చ్చాయి. భారీ అందాల‌తో అప్ప‌ట్లో కుర్ర‌కారు ఎద‌ను గిలిగింత‌లు పెట్టేసింది. తెలుగులో అంద‌రూ స్టార్ హీరోల ప‌క్క‌న సంఘ‌వి న‌టించింది. వెంక‌టేష్ ప‌క్క‌న స‌ర‌దా బుల్లోడు, బాల‌య్య‌కు జోడీగా గొప్పింటి అల్లుడు, స‌మ‌ర‌సింహారెడ్డి, చిరంజీవి మృగ‌రాజు, నాగార్జున సీతారామ‌రాజు సినిమాల్లో న‌టించింది. స్టార్ హీరోయిన్ కాక‌పోయినా సంఘ‌వి చ‌లాకీత‌నం అప్ప‌ట్లో ఎంతో మంది ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను ఎట్రాక్ట్ చేయ‌డంతోనే ఆమెకు మంచి ఛాన్సులు వ‌చ్చాయి.

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్లో వ‌చ్చిన తాజ్‌మ‌హాల్ సినిమాతో ఆమె తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యింది. రెండు ద‌శాబ్దాల పాటు ఆమె తెలుగులో అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూనే వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే అదే సురేష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్లో 1998లో రాజ‌శేఖ‌ర్ హీరోగా వ‌చ్చిన శివ‌య్య సినిమాలో కూడా న‌టించింది. ఈ సినిమా షూటింగ్ టైంలోనే ఈ సినిమా ద‌ర్శ‌కుడు సురేష్ వ‌ర్మ‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అయితే వీరి బంధం ఎన్నో రోజులు నిల‌వ‌లేదు. మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా ఈ బంధం ఎన్నో రోజులు నిల‌వ‌లేదు. విభేదాల కార‌ణంగా ద‌ర్శుడు సురేష్ వ‌ర్మ‌తో విడిపోయింది సంఘ‌వి. ఆ త‌ర్వాత మ‌ళ్లీ కొన్నేళ్ల పాటు సినిమాలు చేసింది. చివ‌ర‌కు ఏజ్ ముదిరిపోయాక 42 ఏళ్ల వ‌య‌స్సులో బెంగ‌ళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌ను పెళ్లి చేసుకుని బెంగ‌ళూరులో సెటిల్ అయిపోయింది.

ప్ర‌స్తుతం సంఘ‌వి దంప‌తుల‌కు ఓ ఆడ‌బిడ్డ పుట్టింది. ఇక సంఘ‌వి ఇప్పుడు వీలు కుదిరితే తెలుగులో సీనియ‌ర్ హీరోయిన్ల‌లా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. చిన్న‌ప్పుడు సంఘ‌విని డాక్ట‌ర్‌ను చేయాల‌ని వారి తల్లిదండ్రులు కోరుకునేవార‌ట‌. అయితే డ్యాన్స్‌మాస్ట‌ర్ ద‌గ్గ‌ర ప‌నిచేయ‌డంతో ఆమె డ్యాన్స్ చూసిన డైరెక్ట‌ర్ సెల్వ ఆమెకు సినిమాల్లో ఛాన్సులు ఇచ్చాడ‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news