Moviesన‌ట‌సింహం మ‌రో ర‌చ్చ‌... బాల‌య్య‌తో మెగాస్టార్‌... ప‌వ‌ర్ స్టార్ ఫిక్స్‌...!

న‌ట‌సింహం మ‌రో ర‌చ్చ‌… బాల‌య్య‌తో మెగాస్టార్‌… ప‌వ‌ర్ స్టార్ ఫిక్స్‌…!

మొదటిసారి నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ సూపర్ క్లిక్ అయింది. మన టాలీవుడ్ స్టార్స్ ఇప్పటికే చాలా టాక్ షోస్, రియాలిటీ షోస్‌కు హోస్టులుగా వ్వయహరించి సక్సెస్ అయ్యారు. అయితే, ఇక్కడ వాస్తవం మాట్లాడుకుంటే మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరులు అంత సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఆ తర్వాత మళ్ళీ ఆయన బుల్లితెర మీద హోస్ట్‌గా సందడి చేయలేదు. కానీ, మిగతా స్టార్స్ నాగార్జున, ఎన్.టి.ఆర్, రానా, నాని, తమన్నా, లక్ష్మీ మంచు, సమంత లాంటి వారు వ్యాఖ్యాతలుగా అదరగొట్టారు.

అయితే, గతకొన్నేళ్ళుగా బాలయ్య హోస్ట్‌గా కనిపిస్తే చూడాలని నందమూరి అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ కూడా ఎదురుచూశారు. కానీ, నాలుగైదేళ్ళు వారి ఎదురుచూపులు ఫలించలేదు. ఎట్టకేలకు బాలయ్యను హోస్ట్‌గా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మార్చారు. ఆయన డిజిటల్ ప్లాట్ ఫామ్ అయిన ఆహా కోసం సరికొత్త టాక్ షోను ప్లాన్ చేసి అన్ స్టాపబుల్ అంటూ ప్రోగ్రామ్ చేయాలనుకున్నారు. దీనికి హోస్ట్ బాలయ్య అయితే బావుంటుందని ఆయనను సంప్రదించారు అల్లు అరవింద్.

బాలయ్యకు తన అభిమానులను, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంటే మహా ఇష్టం. అందుకే వెంటనే షో కాన్సెప్ట్ ఏంటీ అని తెలుసుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ, ఉంటారు కదా కొందరు యాంటీ ఫ్యాన్స్. బాలయ్య మీసం మెలేసి పవర్ ఫుల్ డైలాగులు చెప్పగలరు గానీ, టాక్ షోతో ఎంటర్‌టైన్ చేయగలరు..షో ఫ్లాపే అని కామెట్స్ చేశారు. కట్ చేస్తే అన్ స్టాపబుల్ ఫస్ట్ ఎపిసోడ్‌తోనే బాలయ్య అన్ బిలీవబుల్ అనిపించారు. కామెంట్స్ చేసినవారే అన్నీ మూసేసుకొని షో చూశారు.

అంతకముందు ఇదే ఆహాలో స్టార్ హీరోయిన్ సమంత సామ్ జామ్ అంటూ టాక్ షో చేసింది. నందినీ రెడ్డి దీనికి దర్శకత్వం వహించింది. కానీ, ఈ షో సక్సెస్ కాలేదు. కానీ, బాలయ్య అన్ స్టాపబుల్ మాత్రం సూపర్ సక్సెస్ కావడమే కాదు, అల్లు అరవింద్‌కు మంచి రెవిన్యూ తెచ్చిపెట్టింది. ఇక ఇక్కడ చాలాందికి తెలియని విషయం ఏమిటంటే అన్ స్టాబుల్ షోకు హోస్ట్‌గా చేసినందుకు బాలయ్య తీసుకున్న రెమ్యునరేషన్ జస్ట్ 40 లక్షలు మాత్రమేనట.

ఇప్పుడు హోస్ట్ చేస్తున్న స్టార్ హీరోలందరూ తీసుకుంటున్న రెమ్యునరేషన్ కంటే బాలయ్య చాలా తక్కువ తీసుకోవడం విశేషం. అరవింద్‌కు బాగా లాభాలు రావడానికి కూడా ఇదీ ఒక ముఖ్య కారణం. ఇక త్వరలో NBK – అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదలవబోతుంది. ఈ సీజన్ 2లో మెగాస్టార్, పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోలతో బాలయ్య సందడి చేయబోతున్నట్టు సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news