Movies' గాడ్ ఫాద‌ర్ ' రిలీజ్ డేట్‌పై అదిరే ట్విస్ట్ ఇచ్చిన...

‘ గాడ్ ఫాద‌ర్ ‘ రిలీజ్ డేట్‌పై అదిరే ట్విస్ట్ ఇచ్చిన మెగాస్టార్‌..!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ యేడాది ఆచార్య సినిమాతో చిరు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చినా ఆ సినిమా డిజాస్టర్ అవ్వ‌డంతో త‌న అభిమానుల‌ను తీవ్రంగా నిరాశ ప‌రిచాడు. ఇక ప్ర‌స్తుతం చిరు న‌టిస్తోన్న మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. మోహ‌న‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల్లూవుడ్ హిట్ మూవీ లూసీఫ‌ర్ రీమేక్ గాడ్‌ఫాద‌ర్ సినిమా చేస్తున్నాడు.

మ‌ళ‌యాళంలో మోహ‌న్‌లాల్ హీరోగా ఈ సినిమా వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌య్యింది. అలాగే కోలీవుడ్‌లో ఐదారేళ్ల క్రితం వ‌చ్చిన వేదాళం రీమేక్ భోళాశంక‌ర్ సినిమాలో చిరు న‌టిస్తున్నాడు. త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాకు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌కుడు. కీర్తి సురేష్ చిరుకు చెల్లిగా న‌టిస్తోంది.

అలాగే బాబి ద‌ర్శ‌క‌త్వంలో వాల్తేరు వీర‌య్య సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక ఈ మూడు సినిమాల్లో ముందుగా గాడ్ ఫాద‌ర్ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. వాస్త‌వంగా ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యి రిలీజ్‌కు రెడీగానే ఉంది. అయితే ఆచార్య ఎఫెక్ట్‌తో ఇప్ప‌ట్లో ఈ సినిమా రిలీజ్ కాద‌న్న ప్ర‌చార‌మే జ‌రిగింది.

అయితే గాడ్ ఫాద‌ర్ రిలీజ్‌పై స్వ‌యంగా చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ సినిమా రిలీజ్‌పై బిగ్ క్లారిటీ వ‌చ్చేసిన‌ట్టే అయ్యింది. చిరు లేటెస్ట్‌గా త‌న ఓటీటీ ప్రోగ్రామ్‌లో గాడ్ ఫాద‌ర్‌ను ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామ‌ని చెప్పారు. అస‌లు ముందే ఈ సినిమాను ఆగ‌స్టు 12న రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. థ‌మ‌న్ మ్యూజిక్ ఇస్తోన్న ఈ సినిమాలో స‌ల్మాన్ ఖాన్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news