Moviesఈ మాట ఇన్నాళ్లు గుర్తు రాలేదా అక్షయ్..ఆడేసుకుంటున్న ఫ్యాన్స్..!!

ఈ మాట ఇన్నాళ్లు గుర్తు రాలేదా అక్షయ్..ఆడేసుకుంటున్న ఫ్యాన్స్..!!

కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు..కొన్ని సార్లు మనం ఎక్స్ పెక్ట్ చేయనవి జరుగుతుంటాయి. సో, బీ కేర్ ఫుల్..ఈ డైలాగ్స్ మనం మన పెద్ద వాళ్ల దగ్గర నుండి వింటుంటాం . దాని అర్ధం రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు వు..ఓ మాట మాట్లాడే ముందు..ఓ పని చేసే ముందు..ఆలోచించుకో..అని. ఇప్పుడు ఇదే డైలాగ్ ను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కి కొడుతున్నారు తెలుగు ప్రజలు. మనకు తెలిసిందే..కొన్ని నెలలుగా ఇండస్ట్రీ లో ఎలాంటి పరిస్ధితులు కనిపిస్తున్నాయో..అందరు ఒక్కసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీ పై పది..డౌన్ చేస్తున్నారు.

ఒకప్పుడు హింది సినిమాలు అన్నా, బాలీవుడ్ నటులు అన్నా..ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉండేది. సినీ ఇండస్ట్రీలో వాళ్ళనే టాప్ హీరోలు అనే విధంగా చూస్తూ..తెలుగు, తమిళ, కన్నడ,మలయాళ ఇండస్ట్రీలని తక్కువుగా చూసేవారు. ఆ ఇండస్ట్రీల నుండి బాలీవుడ్ కి వెళ్ళినా చీప్ గా మాట్లాడే వారు చూసేవారు. అందరు అలా ఉన్నారు అని చెప్పలేం కానీ కొంత మంది అలా బీహేవ్ చేసిన సంధర్భాలు ఉన్నాయి. అయితే, కరోనా తరువాత బాలీవుడ్ ఇండస్ట్రీ ఫ్లాప్ అయ్యింది. ఏ సినిమా హిట్ అవ్వట్లేదు. నిర్మాతలకు భారీ నష్టాలు తప్పలేదు. అదే టైంలో సౌత్ లో మంచి మంచి సినిమాలో రిలీజ్ అయ్యి..హీందీలో కూడా భారీ విజయాని అందుకున్నాయి.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన KGF2..ఇలా వరుస సినిమాలు బాలీవుడ్ లో రికార్డ్ స్దాయి కలెక్షన్స్ సాధించాయి. దీంతో, క్రమ క్రమంగా బాలీవుడ్ ఇండస్ట్రీ పడిపోతుందని వార్తలు వినిపించాయి. దీంతో ఇప్పుడు అందరు స్టార్స్ సౌత్-నార్త్ అంటూ తెడాలు చూపకూడదు..మనమంతా ఇండియన్స్,,ఇది భారతీయ సినిమా అని చెప్పలి..అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ మాటలనే అక్షయ్ కుమార్..తాను నటించిన పృథ్వీరాజ్‌ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు.

” ఇక్కడ సౌత్‌, నార్త్‌ అని తేడాల్లేవు.. ఉన్నది భారతీయ సినీ పరిశ్రమ ఒక్కటే. అందరు నతులు పనిచేసేది ప్రేక్షకుల కోసమే అన్ని.. ఇక్కడ ఎవ్వరు ఎవ్వరితోనైన నటించవచ్చు అన్ని..త్వరలో నేను అల్లు అర్జున్‌ తో నటించచ్చు.., అలాగే అల్లు అర్జున్ ఇంకో బాలివుడ్ హీరొ తో పని చేయొచ్చు.. రాబోయే కాలంలో జరిగేది ఇదే’ అని చెప్పుకొచ్చాడు.

ఈ మాటల పై కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు. సౌత్-నార్త్ అని తేడాలు ఉండకూడదు అని..మీకు ముందు తెలియదా..ఓ 10సంవత్సరాలు వెనక్కి వెళ్లి చూసుకో..మీ ఫంక్షన్ లల్లో మా వాళ్ళని ఎలా అవమానించారో”అంటూ మండిపడుతున్నారు. కేవలం ఫ్యాన్స్ నే కాదు కొందరు స్టార్ హీరోలు సైతం..మన తెలుగు ఇండస్ట్రీ వాళ్లని తక్కువ చేసి చూసేవారు అని పలు సంధర్భాలల్లో చెప్పుకొచ్చారు. ఆ రేంజ్ లో బాహుబలి 1, 2, కేజీఎఫ్‌ 1, 2, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలు సౌత్‌ ఇండస్ట్రీ ఖ్యాతిని చాటి చెప్పాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news