Moviesచ‌ర‌ణ్‌తో డేటింగ్ కావాలంటోన్న బాలీవుడ్ కుర్ర హీరోయిన్‌...!

చ‌ర‌ణ్‌తో డేటింగ్ కావాలంటోన్న బాలీవుడ్ కుర్ర హీరోయిన్‌…!

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా త్రిబుల్ ఆర్ సినిమాతో చెర్రీ క్రేజ్ నార్త్‌లో బాగా పాకేసింది. అంత‌కుముందు తుఫాన్ సినిమా చేసినా అది ప్లాప్ అవ్వ‌డంతో చ‌ర‌ణ్‌ను అక్క‌డ ఎవ్వ‌రూ పట్టించుకోలేదు. త్రిబుల్ ఆర్ పాన్ ఇండియా లెవ‌ల్లో హిట్ అవ్వ‌డంతో పాటు చ‌ర‌ణ్ పోషించిన అల్లూరి క్యారెక్ట‌ర్‌కు కూడా మంచి పేరే వ‌చ్చింది.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు చ‌ర‌ణ్ మ‌రో పాన్ ఇండియా ప్రాజెక్టుతో మెస్మ‌రైజ్ చేసేందుకు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. త‌న కెరీర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 15వ ప్రాజెక్టుగా వ‌స్తోన్న సినిమాను శంక‌ర్ ద‌ర్శ‌కత్వంలో చేస్తున్నాడు. నిర్మాత దిల్ రాజు బ్యాన‌ర్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా 50వ సినిమాగా ఈ సినిమా వ‌స్తోంది. ఇదిలా ఉంటే రామ్‌చ‌ర‌ణ్‌పై ఓ బాలీవుడ్ హీరోయిన్ మ‌న‌సు పాడేసుకుంది.

బాలీవుడ్ యంగ్ హీరోయిన్‌, మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ చరణ్‌పై ఇంట్ర‌స్టింగ్ కామెంట్లు చేసింది. చ‌ర‌ణ్ గురించి మ‌నుషీ మాట్లాడుతూ చ‌ర‌ణ్‌కు పెళ్లి కాకుండా ఉండి ఉంటే తాను అత‌డితో డేటింగ్ చేసేదాన్ని అని కామెంట్ చేసింది. దీనిని బ‌ట్టే చ‌ర‌ణ్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థ‌మ‌వుతోంది.

ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ చేస్తోన్న శంక‌ర్ సినిమాకు అధికారి అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఈ సినిమాను వ‌చ్చే యేడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు. ఇక అటు మానుషీ నటించిన చిత్రం పృథ్వీ రాజ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మ‌రి మ‌నుషీ మాట‌లు వింటే చెర్రీ భార్య ఉపాస‌న ఏమంటుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news