Moviesబాలయ్య బిగ్ సర్ప్రైజ్..ఆ డైలాగ్ తో మరోసారి రచ్చ షురూ..?

బాలయ్య బిగ్ సర్ప్రైజ్..ఆ డైలాగ్ తో మరోసారి రచ్చ షురూ..?

నందమూరి నట సింహం బాలయ్య..అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ..కుర్ర హీరోలకు సైతం దడ పుట్టిస్తున్నారు. యంగ్ హీరో లు అయ్యి కూడా రెండు సంవత్సరాలకి ఓ సినిమా కమిట్ అవుతున్న హీరోలకి..బాలయ్య భారీ ఝలక్ ఇస్తూ..వరుస సినిమాలకి సైన్ చేస్తూ..సెట్స్ పై కి తీసుకోస్తున్నారు. ప్రజెంట్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్ లో ఓ క్రేజీ సినిమా చేస్తున్న బాలయ్య..ఆ తరువాత అనిల్ రావిపుడీ తో ఓ జబర్ధస్త్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులు పూర్తి అయ్యిన్నట్లు తెలుస్తుంది.

ఇలా బాలయ్య వరుస సినిమాలు చేస్తుండటం..కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తుండటం.. అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఈ వయసులోను ఏమాత్రం తగ్గని ఎనర్జీ తో డ్యాన్స్ చేస్తూ..సూపర్ హిట్లు కొట్టి.. యూత్ డైరెక్టర్లతో జట్టు కట్టడం నిజంగా బాలయ్యకే చెల్లింది అని చెప్పాలి. కాగా, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న బాలయ్య 107 చిత్రం గురించి అభిమానులను ఉత్సాగ పరిచే న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. దీని పట్ల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనకు తెలిసిందే బాలయ్య తండ్రి గారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు..డైలాగ్స్ చెప్పడం లో కింగ్. ఆయన లా ఇప్పటి నటులు ఎవ్వరు డైలాగ్స్ అంత క్లీయర్ గా చెప్పలేరు .

కాగా, గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వస్తున్న చిత్రంలో బాలయ్య ఓ సీన్ కోసం..ఆయన తండ్రీ గారి ఫేమస్..”ఆచార్య దేవా..! హ హ హ హఏమంటివి ఏమంటివి..!జాతి నేపమున సూత సుతులకిందు నిలువర్హత” …..అనే డైలాగ్ ను మరోసారి తనదైఅన్ స్టైల్ లో చెప్పి నందమూరి అభిమానులను ఉత్సాహ పరచడానికి రెడీ అయ్యిన్నట్లు తెలుస్తుంది. సినిమాలో ఓ ఇంపార్టేంట్ సీన్ లో బాలయ్య ఈ డైలాగ్ చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. ఇది నిజంగా బాలయ్య అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ అనే చెప్పాలి. మరి చూద్దాం , ఈ డైలాగ్ బాలయ్య మాడ్యూలేషన్ లో ఎలా ఉంటుందో..? బాలయ్య అనిల్ రావిపూడి తరువాత తన నెక్స్ట్ చిత్రం దర్శకుడు బివిఎస్ రవికి ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వినికిడి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news