Moviesఎన్టీఆర్ - సావిత్రి కాంబినేష‌న్‌కు ఎందుకు అంత క్రేజ్...!

ఎన్టీఆర్ – సావిత్రి కాంబినేష‌న్‌కు ఎందుకు అంత క్రేజ్…!

ఔను! సినీ రంగంలో అన్న‌గారు ఎన్టీఆర్ ప్ర‌స్థానం అజ‌రామ‌రం. అనేక సినిమాలు ఆయ‌న ర‌క్తి క‌ట్టించారు. ఆయ‌న సినిమాల్లో 90 శాతం హిట్లే.. ఎక్కువ సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్‌. ఆయ‌న పౌరాణిక సినిమాల్లో
ఏకంగా.. ఏళ్ల త‌ర‌బ‌డి ఆడిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే..ఈ క్ర‌మంలో అన్న‌గారితో జ‌ట్టుక‌ట్టిన సావిత్రి ఉంటే.. మ‌రింతగా ఆ సినిమాలు హిట్ అయ్యాయి. ఇత‌ర హీరోయిన్లు.. ముఖ్యంగా అంజ‌లీదేవి, శారద‌, భానుమ‌తి, వాణీశ్రీ, రాజ‌సులోచ‌న‌, కాంచ‌న‌ వంటి వారితో న‌టించిన సినిమాల కంటే.. ఇవి ఎక్కువ‌గా హిట్ట‌య్యాయి.

సావిత్రితో ఎక్కువ‌గా సినిమాలు చేసిన ఎన్టీఆర్‌.. ఇత‌ర హీరోయిన్ల‌తో నాటి త‌రం తార‌ల‌తో త‌క్కువ‌గానే న‌టించారు. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అనేది ప్ర‌శ్న‌. ఒక‌టి.. సావిత్రి-ఎన్టీఆర్ జంట‌కు.. ప్ర‌జ‌ల్లో ఉన్న మ‌క్కువ ప్ర‌ధాన కార‌ణ‌మైతే.. మ‌రొక‌టి.. ఇత‌ర హీరోయిన్ల‌లో లేని ఈజ్‌.. సావిత్రికి ఉండ‌డ‌మే. షూ టింగుల స‌మ‌యంలో జోష్‌గా ఉండ‌డం..క‌లివిడిగా క‌లిసిపోవ‌డం.. అన్న‌గారితో న‌టించేప్పుడు.. జీవి స్తున్న‌ట్టుగా ఉండ‌డం వంటివి ప్ర‌ధానంగా ప్ల‌సులుగా మారాయి.

మ‌రోవైపు. ఎన్టీఆర్‌-సావిత్రి సినిమా అంటే.. షూటింగు మొద‌లు పెట్టిన‌ప్పుడే. వాటిపై భారీ ఎత్తున అంచ నా లు పెరిగిపోయేవి. బ‌య్య‌ర్లు కూడాముందుగానే అడ్వాన్సులు ఇచ్చేవారు. అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల్లో కూడా.. ఈ కాంబినేషన్ మూవీలు స‌క్సెస్ అయ్యేవని.. వంద‌లు కాదు.. నెల‌ల‌ త‌ర‌బ‌డి మూవీలు ఆడ‌తాయ‌నే పేరు ఉండ‌డంతో ఈ కాంబినేష‌న్‌కు ఎక్కువ‌గా జోష్ ఉండేది. ఇక‌, సినిమాల్లోనూ.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య సాగే సీన్ల‌కు కూడా అంతే ప్రాధాన్యం ఉండేది.

దీంతో ఇంటిల్లిపాది సినిమాల‌కు వ‌చ్చేవారు. దీంతో ఎన్టీఆర్‌-సావిత్రి.. కాంబినేష‌న్ సూప‌ర్ హిట్ అనే టాక్ ఉంది. అదే ఇత‌ర హీరోయిన్ల‌తో చేసిన సినిమాలు కూడా హిట్ జాబితాలో ఉన్న‌ప్ప‌టికీ.. వాటికి ఈ రేంజ్‌లో జోష్ వ‌చ్చిన ప‌రిస్థితి లేదు. అందుకే..తెలుగు సినీ వేదిక‌పై ఎన్టీఆర్‌-సావిత్రి జంట‌కు ఎన‌లేని ఆద‌ర‌ణ ఉంద‌న‌డంలో సందేహం లేదు. గుండ‌మ్మ‌క‌థ నుంచి అనేక పౌరాణిక సినిమాల వ‌ర‌కు వీరి జంట‌కు.. ప్రేక్ష‌కులు మంత్ర ముగ్ధులు అయ్యేవారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news