Moviesసీనియ‌ర్ ఎన్టీఆర్ - విక్ట‌రీ వెంక‌టేష్ మిస్ అయిన బాల‌య్య బ్లాక్‌బ‌స్ట‌ర్...

సీనియ‌ర్ ఎన్టీఆర్ – విక్ట‌రీ వెంక‌టేష్ మిస్ అయిన బాల‌య్య బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇదే…!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ కెరీర్‌లో ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఇందులో కొన్ని సినిమాలు ఆయ‌న‌కు మ‌ర‌పురాని సినిమాలుగా ఉన్నాయి. కెరీర్‌లో 99 సినిమాలు చేశాక ఏ హీరోకు, లేదా ద‌ర్శ‌కుడికి అయినా 100వ సినిమా ఓ మ‌ర‌పురాని సినిమాయే..! బాల‌య్య కూడా 99 సినిమాలు చేశాక త‌న వందో సినిమాగా ఏ సినిమా చేయాలి ? ఏ క‌థ ఎంచుకోవాలి ? అనే దానిపై కాస్త క‌స‌ర‌త్తులు చేశాడు. బాల‌య్య వందో సినిమా కోసం చాలా క‌థ‌లే విన్నాడు.

కృష్ణ‌వంశీ ద‌ర్శ‌కత్వంలో రైతు టైటిల్‌తో ఓ సినిమా అనుకున్నారు. ఆ త‌ర్వాత బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌కత్వంలో చేస్తే ఎలా ఉంటుందా ? అని అనుకున్నారు. ఆ త‌ర్వాత అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రామారావు గారు టైటిల్‌తో కూడా ప్లాన్ చేశారు. ఈ క్ర‌మంలోనే క్రిష్ తాను రాసుకున్న ఆంధ్ర‌దేశ శాత‌వాహ‌న చ‌క్ర‌వ‌ర్తి గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా రాసుకున్న క‌థ చెప్ప‌డంతో పాటు ఈ క‌థ‌లో మీరు త‌ప్పా ఎవ్వ‌రూ న‌టించ‌లేరు అని చెప్పాడు.

బాల‌య్య మ‌న‌స్సు ఈ క‌థ మీద‌కే మ‌ళ్లింది. ఓకే చెప్పాడు. కేవ‌లం 79 రోజుల్లో ఎక్క‌డా రాజీప‌డ‌కుండా క్రిష్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. కేవ‌లం 2.15 గంట‌ల్లోనే సినిమా చాలా క్రిస్పీగా వ‌చ్చింది. చివ‌ర‌కు ఈ సినిమా బాల‌య్య కెరీర్‌లో ల్యాండ్ మార్క్ సినిమాగా రావ‌డంతో పాటు చిరంజీవి ల్యాండ్ మార్క్ మూవీ .. ఆయ‌న 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాకు పోటీగా రిలీజ్ అయ్యి సూప‌ర్ హిట్ అయ్యింది.

వెంక‌టేష్ – ఎన్టీఆర్ కాంబినేష‌న్లో మిస్ అయిన శాత‌క‌ర్ణి :
అయితే ఇదే శాత‌క‌ర్ణి క‌థ అంటే సీనియ‌ర్ ఎన్టీఆర్‌కు చాలా ఇష్టం. ఎన్టీఆర్ ఈ సినిమాను చేయాల‌ని అనుకున్నారు. ఎన్టీఆర్ శాత‌క‌ర్ణిగా.. ఆయ‌న కుమారుడు పులోమావిగా వెంక‌టేష్‌ను న‌టింప‌జేయాల‌ని అనుకున్నారు. శ్రీనాథ క‌విసౌర్వ‌భౌముడు సినిమాకు ముందు ఈ సినిమాను తీయాల‌ని అనుకుని.. అందుకు క‌థ కూడా రెడీ చేయించారు ఎన్టీఆర్‌. అయితే బాల‌య్య శాత‌క‌ర్ణికి, ఎన్టీఆర్ తీయాల‌నుకున్న సినిమా క‌థ‌కు తేడా ఏంటంటే ఎన్టీఆర్ రెడీ చేయించిన క‌థ‌లో పులోమావి స్టోరీకి కూడా ప్రాధాన్యం ఉంది.

అందుకే వెంకటేష్‌ను ఈ పాత్ర కోసం తీసుకోవాల‌ని ఆయ‌నే స్వ‌యంగా అనుకున్నారు. ఈ క‌థ వెంక‌టేష్‌కు కూడా వినిపించారు. క‌థ విన్న వెంకటేష్ ఎన్టీఆర్‌తో సినిమా అన‌గానే వెంట‌నే ఓకే చేసేశారు. క‌థ రెడీ అయ్యాక ఎన్టీఆర్ 1994 ఎన్నిక‌ల‌కు ముందు రాజ‌కీయాల్లో మ‌ళ్లీ బిజీ కావ‌డంతో ఈ సినిమా ప‌ట్టాలు ఎక్క‌లేదు. అయితే దాదాపు 23 ఏళ్ల త‌ర్వాత అదే క‌థ‌లో బాల‌య్య త‌న ల్యాండ్ మార్క్ సినిమా చేసి మ‌ర‌పురాని హిట్ కొట్టాడు. అలా ఎన్టీఆర్ – వెంకీ కాంబినేష‌న్లో రావాల్సిన సినిమా మిస్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news