Moviesఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రశ్న..చంపేస్తున్నారు కదరా బాబు..?

ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రశ్న..చంపేస్తున్నారు కదరా బాబు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాన్న పేరు చెప్పుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్లల్లో నాగార్జున, వెంకటేష్, మహేశ్ బాబు కూడా ఉన్నారు. అక్కినేని ఫ్యామిలీ నుండి నాగేశ్వర రావు గారి పేరు చెప్పుకుని ఆయన వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున..అలాగే దగ్గుబాటి రామానాయుడు గారు పేరు చెప్పుకుని ఆయన వారసుడి గా ఇండస్ట్రీలోకి హీరో గా వచ్చాడు వెంకటేష్..

ఇక సూపర్ స్టార్ కృష్ణ పేరు చెప్పుకుని ఘట్టమనేని వంశ వారసుడిగా తెర పైకి ఎంట్రీ ఇచ్చాడు మహేశ్ బాబు. తండ్రి పేర్లు చెప్పుకుని ఇండస్ట్రీలోకి వచ్చినా..తమలోని టాలెంట్ ను చూయిస్తూ..ఒక్కో మెట్టు ఎదుగుతూ..కెరీర్ లో అప్ అండ్ డౌన్స్ చూస్తూ..ఇప్పుడు టాలీవుడ్ టాప్ 5 స్టార్ హీరోలలో వీళ్ళ ముగ్గురు చోటు సంపాదించుకున్నారు. ఇక వీళ్లు ఎక్కడ కనపడినా మీడియా నుండి ఒక్కటే ప్రశ్న ఎక్కువుగా వినిపిస్తుంది.

రీసెంట్ గా సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో మహేశ్ కు..” మీ తండ్రి గారి బయోపిక్ తెరకెక్కిస్తే మీరు నటిస్తారా”అంటూ రిపోర్టర్ అడగగా..మహేశ్..”నో..ఆయన నాకు దేవుడు..నేను ఆయన లా చేయలేను..బయోపిక్ వస్తే మాత్రం ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేస్తా”అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇదే ప్రశ్న F3 ప్రమోషన్స్ లో వెంకటేష్ కు ఎదురవ్వగా..ఆయన మాట్లాడుతూ ..”ఖచ్చితంగా చేస్తా “అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక నాగార్జున ప్రతి సినిమా ప్రమోషన్స్ లో ఈ ప్రశ్న ఎదురు అవుతూనే ఉంటుంది. కానీ ..ఆయన మాత్రం ఆన్సర్ ఇవ్వకుండ మౌనంగానే ఉండిపోతున్నారు. కనీసం మీ పిల్లలు అయినా నటిస్తారా..అంటే దానికి సైలెంట్ గా ఉండిపోతున్నారు..మరి ఆయన మనసులో ఏం ఉందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news