Moviesఆ డైరెక్టర్ నన్ను బాత్రూమ్ లో లాక్ చేసి .. సంచలన...

ఆ డైరెక్టర్ నన్ను బాత్రూమ్ లో లాక్ చేసి .. సంచలన మ్యాటర్ లీక్ చేసిన RP Patnaik..!!

కాలం మారిపోయింది. సమాజంలో ఏవేవో జరుగుతున్నాయి. వాటిని పట్టించుకునే టైం కూడా ఎవ్వరికి లేదు. ఒకప్పటి ప్రేక్షకుల మ్యూజిక్ టేస్ట్‌కు, ఇప్పటి ప్రేక్షకుల మ్యూజిక్ టేస్ట్‌కు చాలా వ్యత్యాసం ఉంది. ఒకప్పుడు మాస్ బీట్లు లేని మెలోడీ మ్యూజిక్‌ను ఆడియెన్స్ ఎక్కువ ఇష్టపడేవారు. అలాంటి మ్యూజిక్‌ను వారికి అందించి వందకు వంద శాతం మార్కులు కొట్టేసిన సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్..ఈ పేరు విని చాలా కాలమే అయినా కూడా అందరికి ఈయన గురించి బాగా తెలుసు. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది సంగీత దర్శకులు వస్తుంటారు పోతుంటారు.. వాళలో కొందరి పేర్లు మాత్రమే జనాలకు గుర్తుంటాయి. అలాంటి పాపులర్ వ్యక్తే ఈ ఆర్ పి పట్నాయక్.

ఆర్పీ…నటనలోనూ తనదైన బాణీ పలికించారు.ఇప్పుడంటే ఆయన పాటలు వినిపించదం లేదు కానీ, ఆరంభంలో యువతను ఉర్రూతలూగించే సంగీతం అందించారు ఆర్పీ. గాయకునిగానూ మురిపించారు ఆర్పీ. కొంతకాలంగా ఆయన సరిగమలు సందడి చేయడం లేదు, పదనిసల ప్రయాణంలో నిదానం చోటు చేసుకుంది. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన .. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలు పాడారు.,,సంగీతాని అందించారు. కాగా, రీసెంట్ గా ఆయన సంగీత దర్శకుడిగా చేసిన సంతోషం సినిమా 20 ఏళ్లను పూర్తిచేసుకుంది.

ఈ సందర్భంగా ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెట్టాడు. ఈ క్రమంలోనే ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ..” సంతోషం సినిమా నా కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాకు ఎప్పటికి గుర్తుండిపోయే చిత్రం. ఈ సినిమా లోని అన్ని పాటలు జనాలకు బాగా నచ్చేశాయి. అయితే, ఈ సినిమాను డైరెక్ట్ చేసిన దశరథ్ నన్ను బాత్రూమ్ లో పెట్టి మరి పాట కంపోజ్ చేయించుకున్నాడు. నిజానికి ఈ సినిమా నేను గోదారిలా అనే పాట్ అనుకున్నాను. కానీ ఆ పల్లవికి ఏం పిక్చరైజ్ చేయాలనేది అర్థం కాలేదంటూ రాజు సుందరం గారు షూటింగు ఆపేసారు.

దీంతో దశరథ్ చాలా టెన్షన్ పడిపోయారు. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. హీరో హీరోయిన్లు .. డాన్సర్లు .. అంతా కూడా ఊటీలో వెయిటింగ్. దీంతో చాలా టెన్షన్ పడ్డాం. ఆ టైంలోనే నేను వాష్ రూం లోకి వెళ్ళాను. అంతే వెంటనే టక్కున బయట లాక్ చేసి దశరథ్..నువ్వు పాట చెప్పితేనే ఓపెన్ చేస్తా అంటూ నన్ను లాక్ చేసాడు. ఇక అప్పుడే..” ‘దేవుడే దిగి వచ్చినా .. స్వర్గమే రాసిచ్చిన’ అనే లైన్ జస్ట్ అలా చెప్పాను. అప్పుడు మిగతా లైన్లు అవే వస్తాయి .. ఇక నువ్వు బయటకి రా అంటూ చెప్పేసి డోర్ ఓపెన్ చేశాడు. ఆ తరువాత పల్లవిని రెడీ చేశాం. ఇక ఆ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీకు తెలిసిందే..”అంటూ ఆ సంగతులను గుర్తు చేసుకున్నాడు RP Patnaik.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news