Moviesమ‌హేష్‌బాబు అందం వెన‌క సూప‌ర్‌స్టార్ కృష్ణ చెప్పిన సీక్రెట్ ఇదే...!

మ‌హేష్‌బాబు అందం వెన‌క సూప‌ర్‌స్టార్ కృష్ణ చెప్పిన సీక్రెట్ ఇదే…!

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన తాజా సినిమా స‌ర్కారు వారి పాట థియేట‌ర్లలోకి వ‌చ్చింది. సినిమాకు మిక్స్ డ్ టాక్ ఉన్నా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది. ఇప్ప‌టికే రు. 160 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌తో పాటు రు. 100 కోట్ల షేర్ కొల్ల‌గొట్టేసింది. ఈ సినిమా విజాయ‌న్ని మ‌హేష్ అభిమానుల‌తో పాటు ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యాన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా విజ‌యాన్ని మ‌హేష్ తండ్రి సీనియ‌ర్ సూప‌ర్‌స్టార్ కృష్ణ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా చెప్పారు. ఏ తండ్రికి అయినా పుత్రుడు విజ‌యం సాధించిన‌ప్పుడు ఉండే ఆనంద‌మే వేరు. స‌ర్కారు వారి పాట సినిమా గురించి కృష్ణ స్పందిస్తూ ఈ సినిమా చూడ‌గానే తాను మ‌హేష్‌కు వెంట‌నే కాల్ చేశానని… చాలా బాగా యాక్ట్ చేశావు… పోకిరి, దూకుడు కంటే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని చెప్పాన‌ని.. ఇప్పుడు అదే జ‌రిగినందుకు తాను చాలా హ్యాపీగా ఉన్నాన‌ని కృష్ణ చెప్పారు.

ఇన్నేళ్ల త‌ర్వాత కూడా మ‌హేష్ పోకిరి కంటే వ‌య‌స్సులో చాలా త‌క్కువుగా క‌నిపిస్తున్నాడ‌ని… మ‌హేష్ బాగా మెయింటైన్ చేస్తాడ‌ని.. షూటింగ్‌లు లేక‌పోతే జిమ్‌లోనే ఎక్కువుగా ఉంటాడు.. అందువ‌ల్లే అలా క‌నిపిస్తున్నాడంటూ మ‌హేష్ అందం సీక్రెట్ చెప్పారు కృష్ణ‌. ఇక మ‌హేష్‌బాబుకు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర చేసే ఆలోచ‌న ఉంద‌న్న టాక్ వ‌స్తోంది.. దీనిపై మీరేమంటారు ? అని ప్ర‌శ్నిస్తే.. దానికి క‌ష్ణ షాకింగ్ ఆన్స‌రే ఇచ్చారు.

మ‌హేష్ నూటికి నూరుశాతం అల్లూరి సీతారామ‌రాజు పాత్ర చేయ‌డు అని కృష్ణ చెప్పేశారు. ఇక టాలీవుడ్‌లో బ‌యోపిక్‌ల ప‌ర్వం న‌డుస్తోంది. ఈ క్ర‌మంలోనే సూప‌ర్‌స్టార్ కృష్ణ బ‌యోపిక్ కూడా మ‌హేష్‌బాబు చేస్తే బాగుంటుంద‌న్న కోరిక ఘ‌ట్ట‌మ‌నేని అభిమానుల్లో ఉంది. దీనిపై మ‌హేష్ స్పందిస్తూ త‌న తండ్రి బ‌యోపిక్ ఎవ‌రైనా చేస్తే బాగుంటుంద‌ని.. అది నా కోరిక కూడా అని.. కానీ తాను మాత్రం అందులో న‌టించ‌న‌ని చెప్పేశారు.

అంటే కృష్ణ బ‌యోపిక్‌ను ట‌చ్ చేయ‌లేన‌ని మ‌హేష్ ఓపెన్‌గానే చెప్పేశారు. ఇక స‌ర్కారు వారి పాట స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న మ‌హేష్ ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసే సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. 2010లో వ‌చ్చిన ఖ‌లేజా త‌ర్వాత వీరి కాంబోలో వ‌చ్చిన సినిమా ఇదే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news