Movies"తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది.. మరొక్కసారి తాకిపో తాతా"..తారక్ ఎమోషనల్ ట్వీట్..!!

“తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది.. మరొక్కసారి తాకిపో తాతా”..తారక్ ఎమోషనల్ ట్వీట్..!!

మన పెద్దలు చెప్పుతుంటారు..బ్రతినంత కాలం .. “వాడు బ్రతుకు ఏంటి రా ఇలా అయ్యిపోయింది అని అనుకోకుండా”..మనం చనిపోయాక కూడా అబ్బ..బ్రతికినంత కాలం మంచిగా బ్రతికాడు రా..అని చెప్పుకొవాలి. అలా చాలా తక్కువ మందే అనిపించుకోగలరు. ఈ భూమి మీద ఎంతో మంది పుడుతుంటారు, పోతుంటారు. కానీ, కొంత మంది మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కుతారు. చనిపోయిన తరువాత కూడా వాళ్లని ప్రజల తమ గుండెల్లో చిరస్థాయిగా నిలుపుకుంటారు. అలాంటి మహానుభావుల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒకరు. ప్రతీ తెలుగు వాడు గర్వపడే నటుడు నందమూరి తారకరాముడు. ఆయన నటనకు కళామతల్లి మురిసిపోయింది. “అన్న” అని అంతా పిలుచుకునే వారు. బహుశా అన్న అనే పదం ఆయనను చూసే పుట్టిందేమో ..

సినిమాలో నే కాదు రాజకీయ నాయకుడిగా కూడా ఆయనకు లేరు సాటి. కొత్త పధకాలు అమలు చేయడంలో..అవి ప్రజలకి సరిగ్గా అందుతున్నాయో లేదో తెలుసుకోవడంలో ..నందమూరి తారక రామారావు లా ఇప్పటి వరకు ఎవ్వరు చేయలేదు. ఇక పై చేయలేరు కూడా..అన్ని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. వెండితెరపై అందాల రాముడైనా … కొంటె కృష్ణుడైనా ..ఏడుకొండల వాడైనా..ఇలా ఏ పాత్రయినా ఆయన చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుందంటారు నందమూరి అభిమానులు.

ఇవాళ్ల ఎన్టీఆర్ శత జయంతి. ఈ సందర్భంగా ఆ మహా మనీషిని పలువురు సినీ ప్రముఖులు గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన మనవడు తారక్ సోషల్ మీడియా వేదికగా..తాత ను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ సంధర్బంగా జూనియర్ NTR ఆసక్తికర ట్వీట్ చేశారు. “మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా”.. అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

ఇక స్వర్గీయ ఎన్టీఆర్‌కి తన మనవళ్లైన జూనియర్‌ ఎన్టీఆర్‌, నందమూరి కళ్యాణ్‌రామ్‌లంటే భలే ఇష్టం. ఇద్దరికీ పేర్లు పెట్టింది కూడా ఆయనే. జూనియర్‌ని నటునిగా చేయాలని, కళ్యాణ్‌రామ్‌ని ఇంజనీర్‌ని చేయాలని ఆయన కోరిక. అనుకున్నట్లే ఎన్టీఆర్‌ బాల్యం నుంచి నటునిగా క్రేజ్‌ తెచ్చుకుంటూ ఉంటే కళ్యాణ్‌రామ్‌ తమ తాత కోరిక మేరకు కోయంబత్తూరులో ఇంజనీరింగ్‌ చేశాడు. చివరకు ఆయన కూడా నటునిగా, నిర్మాతగా మారాడు. అయితే సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో .. ఇండస్ట్రీలో దూసుకుపోతుంది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. పెద్దాయనలా ఉండటం, నటనలో ఏమాత్రం తీసిపోని ప్రతిభతో తారక్ కు బారీగా ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news