Moviesకీర్తి సురేష్‌పై మ‌హేష్‌కు ఇంత ప్రేమా... ఏంటి అస‌లు క‌థ‌...!

కీర్తి సురేష్‌పై మ‌హేష్‌కు ఇంత ప్రేమా… ఏంటి అస‌లు క‌థ‌…!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు ప‌క్క‌న ఒక్క సినిమాలో హీరోయిన్‌గా చేసే ఛాన్స్ వ‌స్తే చాలు జీవితం ధ‌న్యం అయిపోయింద‌నే చాలా మంది హీరోయిన్లు అనుకుంటారు. మ‌హేష్ ప‌క్క‌న ఒక్క సినిమా చేస్తే వ‌చ్చే ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది. కొంద‌రు హీరోలు – హీరోయిన్ల కాంబినేష‌న్ ఎన్నిసార్లు రిపీట్ అయినా కూడా ప్రేక్ష‌కుల్లో ఎంతో ఆస‌క్తి ఉంటుంది. మ‌హేష్‌బాబు వ‌రుస‌గా క్రేజీ హీరోయిన్ల‌తో రొమాన్స్ చేస్తూ వ‌స్తున్నాడు.

శృతీహాస‌న్‌, కాజ‌ల్‌, స‌మంత‌, ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌, కైరా అద్వానీ, పూజా హెగ్డే, ర‌ష్మిక మంద‌న్న‌తో మ‌హేష్ న‌టించేశాడు. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా మ‌హేష్ ప‌క్క‌న ఉంటే ఆ హీరోయిన్‌కే అందం వ‌చ్చేంత సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌. తాజాగా మ‌హేష్ న‌టిస్తోన్న స‌ర్కారు వారి పాట సినిమా రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఈ సినిమాలో మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ తొలిసారి జోడీ క‌ట్టింది.

కీర్తి అంటేనే ఎంత అంద‌మో తెలిసిందే. కీర్తికి అందంతో పాటు చ‌క్క‌ని అభిన‌యం కూడా ఉంది. ఆమెకు ఈ త‌రం హీరోయిన్ల‌లో పోటీ ఇచ్చే వాళ్లే లేరు. మ‌హాన‌టి సినిమాతో ఆమె న‌ట‌న‌ను దేశం అంతా మెచ్చుకుంది. కీర్తి – మ‌హేష్‌ను ప‌క్క ప‌క్క‌న చూడ‌డం అంటేనే తెలుగు సినీ ల‌వ‌ర్స్ ఎంతో ఎగ్జైట్మెంట్‌తో ఉన్నారు. వీరిద్ద‌రి జోడీలో ట్రైల‌ర్లో వ‌చ్చిన సీన్ల‌కే ఫ్యాన్స్‌కు పూన‌కాలు వ‌చ్చేస్తున్నాయి. రేపు సినిమా ఫ‌స్టాఫ్‌లో వ‌చ్చే 45 నిమిషాల ల‌వ్ ట్రాక్‌ను ఫ్యాన్స్ పిచ్చ పిచ్చ‌గా ఎంజాయ్ చేస్తార‌ట‌.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్ర‌తి ప్ర‌మోష‌న్లోనూ మ‌హేష్ కీర్తి గురించి చాలా గొప్ప‌గా చెపుతున్నాడు. గ‌తంలో మ‌హేష్ త‌న సినిమాల ఇంట‌ర్వ్యూల్లో ఇంత గొప్ప‌గా ఏ హీరోయిన్‌ను పొగిడిన‌ట్టు లేదు. ర‌ష్మిక‌, పూజ లాంటి వాళ్ల‌పై కొన్ని చెణుకులు విసిరినా.. కీర్తికి మ‌త్రం ఎందుకో ఎప్పుడూ లేనంత అప్లాజ్ ఇస్తున్నాడు. సినిమాలో కీర్తి రోల్‌తో పాటు ఆమె పెర్పామెన్స్ పై ప‌దే ప‌దే ప్ర‌శంస‌లు కురిపిస్తున్నాడు.

నిజం చెప్పాలంటే ప్ర‌తి ఇంట‌ర్వ్యూలోనూ ఆమెను ఆకాశానికే ఎత్తుతుంటే మ‌హేష్ ఆమెపై చాలా ప్రేమ చూపిస్తున్నాడ‌నే అంద‌రూ అంటున్నారు. ఆమెకు ఇదో స‌ర్‌ఫ్రైజ్ ప్యాకింగ్ అనుకోవాలి. స‌ర్కారు వారి పాట‌లో ఆమె న‌ట‌న చూసి ప్ర‌తి ఒక్కరు చాలా థ్రిల్ ఫీల్ అవుతార‌ని.. గ‌తంలో ఆమెలో ఎన్న‌డూ చూడ‌ని న‌ట‌న ఈ సినిమాలో ఉంటుంద‌ని కూడా మ‌హేష్ చెపుతున్నాడు. మ‌రి మ‌హేషుడే ఇంత‌లా ఆకాశానికి ఎత్తేస్తున్నాడంటే కీర్తి న‌ట‌న ఎంత స‌ర్‌ఫ్రైజింగ్‌గా ఉంటుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news