Moviesసమంత ఎప్పటికైన అలా చావాల్సిందే..అదేంటి అంత మాట అనేశాడు..?

సమంత ఎప్పటికైన అలా చావాల్సిందే..అదేంటి అంత మాట అనేశాడు..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక..చిన్న విషయాని కూడా రాద్ధాంతం చేస్తున్నారు కొందరు నెటిజన్స్. తమకు నచ్చితే మెచ్చుకోవాలి..నచ్చక పోతే సైలెంట్ గా ఉండాలి..కానీ, ఈ మధ్య కాలంలో కొందరు కుర్రాళ్లు మరీ హద్దు మీరిన కామెంట్స్ చేస్తూ..వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఆ లిస్ట్ సమంత ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది.

సమంత అంటే ఒకప్పుడు ఎంత గౌరవం ఇచ్చేవాళ్లో ..ఇప్పుడు అంతకంటే ఎక్కువు గా దిగజారిన మాటలు మాట్లాడుతున్నారు. ఇందుకు కారణం అందరికి తెలిసిందే..సమంత అక్కినే ట్యాగ్ తీసేసినప్పటినుండి..ఆమెకు ఈ ట్రోలింగ్ బాధలు ఎక్కువైయాయి. ఒకడు సెకండ్ హ్యాండ్ అంటాడు..మరోకడు వల్గర్ కామెంట్స్ చేస్తాడు..మరోకడు శాపనార్ధాలు పెట్టుతారు..ఇలా సోషల్ మీడియాలో ఎక్కువ నెగిటివిటీ అందుకుంటున్నా సమంత మాత్రం ఎప్పుడు వాటికి కూల్ గానే ఆన్సర్ ఇచ్చింది.

ఇక ఇప్పుడు ఓ నెటిజన్ హద్దులు అన్ని దాటేసి..మరీ ఆమె పరసనల్ లైఫ్ పై కామెంట్ చేశాడు. మనకు తెలిసిందే సమంత కి కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం. తను సమయం దొరికినప్పుడల్లా వాటితోనే టైం గడుపుతుంది. దానికి సంబంధించిన ఫోటొలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇక అలా షేర్ చేసిన ఫోటోకి ఓ నెటిజన్..”తన పెట్స్‌ కుక్కలు, పిల్లులతో ఆమె ఒంటరిగా చనిపోవాలి’ అంటూ కామెంట్‌ పెట్టాడు.

దీనికి సమంత కూల్ గానే..”అలా జరిగితే నాకన్న అదృష్టవంతురాలు ఎవ్వరు ఉండరు అనుకుంటా” అంటూ పెట్స్ పై తనకు ఉన్న ప్రేమను చెప్పుతూనే నెటిజన్ కి ఘాటు రిప్లై ఇచ్చింది. ఇక సమంత ఫ్యాన్స్ ఆ నెటిజన్ పై రివర్స్ కౌంటర్లు స్టార్ట్ చేశారు. దీంతో ఆ నెటిజన్ కామెంట్ ని డిలిట్ చేశాడు. కానీ అప్పటికే అది స్క్రీన్ షాట్ తీసి నెట్టింట వైరల్ గా మార్చేశారు ట్రోలర్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news