Moviesప్రభాస్ సలార్ ప్రోడ్యూసర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్..ఫ్యాన్స్ ఊరుకుంటారా..!!

ప్రభాస్ సలార్ ప్రోడ్యూసర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్..ఫ్యాన్స్ ఊరుకుంటారా..!!

ఇండియన్ సినిమా ఈగర్ గా వెయిట్ చేస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ..”సలార్”. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్లల్లో ఇది ఒకటి. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం మరో ప్లస్ పాయింట్. ఈ ఇద్దరకి కి జనాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వాళ్ల టాలెంట్ పై నమ్మకం ఉంది. బాహుబలి తో ప్రభాస్, KGF సిరిస్ తో ప్రశాంత్ నీల్ ఇద్దరు అభిమానులకు హ్యూజ్ ఎక్స్ పెక్స్టేషన్స్ ఇచ్చేశారు.

దీంతో ఈ సినిమా పై అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఇక అభిమానుల ఆశలను ఏ మాత్రం నిరాశపరచకుండా డైరెక్టర్ టాప్ రేంజ్ లో సినిమాని చిత్రీకరిస్తున్నారు అని లీకైన పిక్స్ ఆధారంగానే తెలుస్తుంది. అఫిషియల్ గా సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుండి..సినిమా నుండి ఎన్ని పిక్స్ లీకైయాయో మనం చూస్తూనే ఉన్నాం రీసెంట్ గా కూడా షూటింగ్ స్పాట్ నుండి ప్రభాస్ పిక్ లీకై నెట్టింట వైరల్ గా మారింది.

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నా..చిత్ర మేకర్స్ టెన్షన్ పడు తున్నారు. అసలు ఎలా ఈ పిక్స్ లీక్ చేస్తున్నారో తెలియక సతమవుతున్నారు. ఈ క్రమంలోనే సలార్ సినిమా ప్రోడ్యూసర్ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు. సలార్ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్ ట్వీట్ చేస్తూ..”సలార్ సినిమా కోసం అన్నీ భారీ స్థాయిలో నే సెట్ చేసాం. పాన్ ఇండియా నంబర్ వన్ హీరో ప్రభాస్, సెకెండ్ పాన్ ఇండియా బిగ్గెస్ట్ మూవీ ఇదే అవుతుంది.

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంతో నీల్ తో పాన్ ఇండియా హీరో అంటే అది డెడ్లీ కాంబినేషన్ నే. ఈ కాంబో సెట్ అయినప్పుడే అతి పెద్ద సవాల్‌గా మారింది. ఫ్యాన్స్ అంచనాలు ఖచ్చితంగా అందుకుంటా. సలార్ మూవీ కుంభస్థలాన్ని బద్దలు కొడతామంటూ “..ఆయన ధీమా వ్యక్తంచేశారు. షూటింగ్ స్పాట్ నుండి ఇలా వరుస పిక్స్ లీక్ అవుతున్న క్రమంలో ఆయన ఇలా ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. అయితే విజయ్ కిరగందుర్ చేసిన వ్యాఖ్యలను డార్లింగ్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఫుల్ ఖుషీ అవుతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news