Moviesఅయ్య బాబోయ్..కోవై సరళను చూశారా..అస్సలు గుర్తుపట్టలేం..!!

అయ్య బాబోయ్..కోవై సరళను చూశారా..అస్సలు గుర్తుపట్టలేం..!!

కోవై సరళ..ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తన కామెడీ టైమింగ్ తో జనాలని కడుపుబ్బా నవించిన మహానటి. తెర పై ఈమె కనిపిస్తే నవ్వులే నవ్వులు. ఈ లేడీ కమెడియన్ కూడా సౌత్ సినిమా ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. ఓ టైంలో సినీ ఇండస్ట్రీని ఏలేసిన నటి. బడా బడా స్టార్స్ కూడా తమ సినిమాల్లో ఈమెను కమెడీయన్ రోల్ ఇచ్చేవారు. కోవై సరళ.,, తమిళ అమ్మాయి అయినా కూడా తెలుగులో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా బ్రహ్మానందంతో కోవై సరళ చేసిన కామెడీ ఎప్పుడు చూసినా ఫ్రెష్ గానే ఉంటుంది.

ఎన్నో సినిమాలలో వీరి ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతం. సినిమాలో వీరు ఇద్దరు భార్య భర్తల పాత్ర పోషిస్తే ఇంక కామిడీకి కొదవ లేదు. ఎటువంటి సంధర్భాన్ని అయినా తన వైపు తిప్పుకుని స్పాట్ లో నవ్వించే సతా ఉన్న లేదీ కమెడీయన్. బ్రహ్మానందం ఎన్నో సినిమాలలో నటించారు. హాస్యం పండించడంలో ఆయన ముందుంటాడు. అయితే వీరి కాంబినేషన్ మాత్రం కేక పెట్టిస్తుంది.

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 800 సినిమాలకు పైగా నటించింది కోవై సరళ. కేవలం ప్రొఫెషనల్ గానే ఈమె అందరికీ తెలుసు. కానీ పర్సనల్ లైఫ్ లో ఈమె చేసిన త్యాగం గురించి ఎవరికీ తెలియదు. 59 ఏళ్ళ ఈ లేడీ కమెడియన్ ఇప్పటికీ కుమారిగానే ఉండిపోయింది. ఈమె పెళ్లి చేసుకోకపోవడం వెనక పెద్ద కథే ఉంది. కుటుంబం లో ఉన్న కొన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈమె పెళ్లికి దూరం అయ్యారు.

అయితే కొన్నాళ్లు గా సినీ ఇండస్తృఈకి దూరంగా ఉన్న ఈమె..ఆ తరువాత 2019 లో వచ్చిన అభినేత్రి 2 చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. మళ్లీ ఆమె ఇన్నాళ్లకు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఆమె నతీంచిన సినిమా తాలుక ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్. కోవై సరళ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సెంబి’. ‘అరణ్య’ చిత్రంతో తెలుగువారికి సుపరిచితుడిగా మారిన ప్రభు సాల్మన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన స్ట‌న్నింగ్ పోస్ట‌ర్‌ను అభిమానులతో పంచుకున్నారు. 70 ఏళ్ల‌కు పైబ‌డిన వృద్దురాలిగా స్కార్ప్‌లో సీరియ‌స్ షేడ్స్ తో ఉన్న కోవై స‌ర‌ళ ఓ అమ్మాయిని హ‌త్తుకొని ఉన్న పిక్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ క్యూరియాసిటీని పెంచుతోంది. ఇందులో కోవై సరళ లూక్ అందరనీ ఆశ్చర్యపరుస్తోంది. ఇన్నాళు ఆమె ఎక్కడ ఉందో..ఏమైపోయిందో అనుకున్న జనాలు సడెన్‌గా చూసి ఈమె కోవై సరళేనా.. లేక మరేవరైనా.. అని అనుమానిస్తున్నారు. అంతలా డైరెక్టర్ ఆమె లుక్ మార్చేశారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news