MoviesNBK # 107 లుక్ లీక్‌... స్టైలీష్‌గా చంపేస్తోన్న న‌ట‌సింహం బాల‌య్య‌...!

NBK # 107 లుక్ లీక్‌… స్టైలీష్‌గా చంపేస్తోన్న న‌ట‌సింహం బాల‌య్య‌…!

అఖండ త‌ర్వాత నందమూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తోన్న సినిమా షూటింగ్ శర‌వేగంగా న‌డుస్తోంది. క్రాక్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత మ‌లినేనీ గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాకు చాలా సానుకూల అంశాలే క‌లిసి వ‌స్తున్నాయి. హీరో అఖండ జోష్‌లో ఉంటే.. ద‌ర్శ‌కుడు క్రాక్ మూడ్‌లో ఉన్నాడు. ఇక బ్యాన‌ర్ మైత్రీ మూవీస్‌కు వ‌రుస‌గా సూప‌ర్ హిట్లే వ‌స్తున్నాయి. మాంచి ఫామ్‌లో ఉన్న థ‌మ‌న్ ఈ సినిమాకు కూడా స్వ‌రాలు అందిస్తున్నాడు.

పైగా అన్ని భాష‌ల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యేలా న‌టీన‌టులు ఈ సినిమాలో ఉన్నారు. అందాల తార శృతీహాస‌న్ బాల‌య్య‌కు జోడీగా హీరోయిన్‌గా న‌టిస్తోంది. కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ వ‌ర‌లక్ష్మి శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తోంది. క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ ముస‌ళ్ల‌మ‌డుగు ప్ర‌తాప్‌రెడ్డి అనే ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

కంటిన్యూగా షూటింగ్ పూర్తి చేసి వ‌చ్చే ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ పూర్త‌వ్వ‌గా… మూడో షెడ్యూల్ రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్లాన్ చేశారు. సిరిసిల్ల షెడ్యూల్లో కంప్లీట్ యాక్ష‌న్ పార్ట్ షూట్ చేశారు. హైద‌రాబాద్ స‌మీపంలో జ‌రిగిన రెండో షెడ్యూల్లోనూ మ‌ళ్లీ యాక్ష‌న్ పార్టే తీశారు. ఇప్పుడు ఫిల్మ్‌సిటీలో ఓ ఐటెం సాంగ్ చిత్ర‌క‌రించే ప్లాన్ చేశారు.

ఈ ఐటెం సాంగ్ కోసం డింపుల్ హ‌య‌తీని తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ స్టిల్ లీక్ అయ్యింది. న‌ట‌సింహం బాల‌య్య‌తో పాటు ద‌ర్శ‌కుడు గోపీచంద్‌, సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ ఉన్నారు. బాల‌య్య చాలా స్టైలీష్‌గా క‌నిపిస్తున్నాడు. కోర‌మీసాల‌తో పాటు బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్‌తో య‌న‌ర్జిటిక్ బాల‌య్య‌గా ద‌ర్శ‌న‌మిస్తున్నాడు. బాల‌య్య లుక్ చూస్తుంటేనే మనం 15 ఏళ్ల వెన‌క్కు వెళ్లిపోయి నాటి బాల‌య్య‌ను గుర్తు చేసుకుంటాం.

ఇక ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్ ప్ర‌కారం ఈ సినిమా బాగా వ‌స్తుంద‌నే అంటున్నారు. బాల‌య్య ఫ్యాన్స్ మెచ్చే మాస్ అంశాల‌తో పాటు కావాల్సినంత యాక్ష‌న్‌… ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుద‌ని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news