Moviesత‌న క‌ళ్ల జోడు అడిగిన స్టార్ న‌టుడికి మ‌హేష్ షాకింగ్ రిప్లై...!

త‌న క‌ళ్ల జోడు అడిగిన స్టార్ న‌టుడికి మ‌హేష్ షాకింగ్ రిప్లై…!

స‌ర్కారు వారి పాట టాక్‌తో సంబంధం లేకుండా వ‌సూళ్ల‌లో దున్నేస్తోంది. ఫ‌స్ట్ డే సోష‌ల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ టార్గెట్ వల్ల స‌ర్కారు వారి పాట‌కు మిక్స్ డ్ టాక్ వ‌చ్చినా కూడా వ‌సూళ్ల ప‌రంగా దుమ్ము రేపుతోంది. ఈ సినిమాలో మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ న‌టించింది. కీర్తితో పాటు విల‌న్‌గా స‌ముద్ర‌ఖ‌ని, త‌నికెళ్ల భ‌ర‌ణి, వెన్నెల కిషోర్‌, ప్ర‌భాస్ శ్రీను లాంటి న‌టులు కూడా న‌టించారు. విల‌న్ పాత్ర‌లో రాజేంద్ర‌నాథ్ గా అద‌ర గొట్టేశాడు స‌ముద్ర‌ఖ‌ని.

అల వైకుంఠ‌పురంలో విల‌న్‌గా చేసిన స‌ముద్ర‌ఖ‌ని మ‌రోసారి స‌ర్కారు వారి పాటలో అంత‌కు మించిన ప‌వ‌ర్ ఫుల్ విల‌న్‌గా మెప్పించాడు. ఈ విల‌న్ పాత్ర కోసం ద‌ర్శ‌కుడు ప‌ర‌శురాం చాలా మంది పేర్లు ప‌రిశీలించాడు. చివ‌ర‌కు స‌ముద్ర‌ఖ‌ని పేరును మ‌హేష్ స్వ‌యంగా రిక‌మెండ్ చేశాడు. స‌ముద్ర‌ఖ‌ని పాత్ర సినిమాకు హైలెట్‌గా నిలిచింద‌ని స‌ర్కారు వారి పాట టీం అంతా చెపుతోంది.

మ‌హేష్ కూడా స‌ముద్ర‌ఖ‌ని పాత్ర గురించి ప్రతి ఇంట‌ర్వ్యూలోనూ గొప్ప‌గా చెపుతున్నాడు. సముద్రఖని న‌ట‌న‌, సెట్లో ఆయ‌న బిహేవియ‌ర్ కూడా అద్భుతం అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. అంతేకాదు ఇక్క‌డ వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన ఓ ఇంట్ర‌స్టింగ్ విష‌యాన్ని కూడా మ‌హేష్ చెప్పాడు. స‌ముద్ర‌ఖ‌నికి క‌ళ్ల‌జోళ్లు సేక‌రించే అల‌వాటు ఉంద‌ట‌. ఎక్క‌డైనా కొత్త క‌ళ్ల‌జోళ్లు, డిఫ‌రెంట్‌గా ఉన్న క‌ళ్ల‌జోళ్లు క‌నిపిస్తే వెంట‌నే వాటిని క‌లెక్ట్ చేస్తూ ఉంటాడ‌ట‌.

స‌ర్కారు వారి పాట‌లో మ‌హేష్‌బాబు స్పెట్స్‌తో చాలా అందంగా క‌నిపించ‌డంతో స‌ముద్ర‌ఖ‌ని ఆయ‌న స్టైల్‌ను ప్ర‌శంసించాడ‌ట‌. మ‌హేష్ క‌ళ్ల‌జోళ్లు బాగా న‌చ్చ‌డంతో మీరు వాడిన క‌ళ్ల‌జోళ్ల‌లో ఒక‌టి ఇస్తారా ? మీ గుర్తుగా దాచుకుంటాను ? అని మ‌హేష్‌ను అడిగాడ‌ట స‌ముద్ర‌ఖ‌ని. వెంట‌నే మ‌హేష్ ఈ సినిమాలో మీ న‌ట‌న బాగుంది.. మీకు ఒక్క క‌ళ్ల‌జోడు ఏంటి ? మీ కోసం ఓ క‌ళ్ల‌జోళ్ల షాపే కొనిస్తాన‌ని చెప్పాడ‌ట‌.

దీంతో స‌ముద్ర‌ఖ‌ని ఆనందంతో త‌బ్బిఉబ్బైపోయాడ‌ట‌. మ‌రి మ‌హేష్ స‌ముద్ర‌ఖ‌ని కోసం ఓ క‌ళ్ల‌జోడు ఇస్తాడా ? లేదా క‌ళ్ల‌జోళ్ల షాపే ఇస్తాడా ? అన్న‌ది చూడాలి. ఇక స‌ముద్ర‌ఖ‌ని త్వ‌ర‌లోనే తన ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా ఓ సినిమా చేస్తున్న‌ట్టు చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news