Moviesక‌ళ్లు చెదిరేరేటుకు ' లైగ‌ర్ ' ప్రి రిలీజ్ బిజినెస్‌... వామ్మో...

క‌ళ్లు చెదిరేరేటుకు ‘ లైగ‌ర్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌… వామ్మో రౌడీ హీరో క్రేజ్ ఈ రేంజ్‌లోనా…!

టాలీవుడ్‌లో ఇప్పుడు అంతా యూత్ సినిమాల హంగామానే న‌డుస్తోంది. యూత్ సినిమాలు, ల‌వ్ సినిమాలు అంటే యువ‌త పిచ్చిపిచ్చ‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే ర‌చ్చ రంబోలా అయిపోయింది. త‌న‌దైన స్టైల్‌తో పాటు డైలాగ్ డెలివ‌రీతో విజ‌య్ యూత్‌లో పిచ్చ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.

ముఖ్యంగా అర్జున్‌రెడ్డి సినిమాతో టాలీవుడ్ యూత్ విజ‌య్‌కు బాగా క‌నెక్ట్ అయిపోయారు. స్టార్ హీరోల‌తో దాదాపు స‌మానంగా విజ‌య్ క్రేజ్ ఉంది. ఇక గీత‌గోవిందం సినిమాతో కూడా విజ‌య్‌కు మాంచి పాపులారిటీ వ‌చ్చింది. తాజాగా విజ‌య్ న‌టించిన సినిమా లైగ‌ర్‌. టాలీవుడ్ డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు బాలీవుడ్ బ‌డా ప్రొడ్యుస‌ర్ క‌ర‌ణ్ జోహార్ కూడా యాడ్ అవ్వ‌డంతో లైగ‌ర్‌కు పాన్ ఇండియా ఇమేజ్ వ‌చ్చేసింది.

లైగ‌ర్‌ను పాన్ ఇండియా లెవ‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్‌కు ముందే స్టిల్స్‌, పోస్ట‌ర్ల‌తో లైగ‌ర్‌కు మంచి హైప్ అయితే వ‌చ్చేసింది. ఇక ఈ సినిమాకు క‌ళ్లు చెదిరే ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోంది. నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కుల్లో ఆడియో రైట్స్‌ను సోని మ్యూజిక్ వారు రు. 14 కోట్ల‌కు కొన్నార‌ట‌. ఇక నాన్ థియేట్రిక‌ల్ రైట్స్‌ను అన్ని భాష‌ల్లోనూ క‌లిపి రు. 85 కోట్ల‌కు అమ్మార‌ని టాక్ .

ఇక రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్‌ను రు. 70 కోట్ల‌కు అమ్మార‌ని అంటున్నా… రు. 60 కోట్ల రేంజ్‌లో భేర‌సారాలు న‌డుస్తున్నాయ‌ని అంటున్నారు. వ‌రంగ‌ల్ శ్రీనుకు నైజాం రైట్స్ దాదాపు ఖాయ‌మైన‌ట్టే అంటున్నారు. లైగ‌ర్‌ను ఛార్మి మరియు ధర్మ ప్రొడక్షన్స్ క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్వ‌యంగా క‌ర‌ణ్ జోహార్ అంత‌టి వాడే ఈ సినిమా నిర్మాణంలో భాగ‌స్వామిగా మారాడు అంటే సినిమాపై ఎలాంటి హైప్ ఉందో తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news