Moviesమా ఇద్ద‌రు కూతుళ్ల‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు... జీవిత బాధ చూశారా...!

మా ఇద్ద‌రు కూతుళ్ల‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు… జీవిత బాధ చూశారా…!

సీనియ‌ర్ న‌టి జీవితా రాజ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భ‌ర్త సీనియ‌ర్ హీరో డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ న‌టించిన శేఖ‌ర్ సినిమా రేపు రిలీజ్ అవుతోంది. గ‌రుడ‌వేగ‌, క‌ల్కి సినిమాల‌తో కాస్త ఫామ్‌లోకి వ‌చ్చిన రాజ‌శేఖ‌ర్ న‌టించిన ఈ సినిమా మ‌ళ‌యాళ రీమేక్‌కు తెలుగు వెర్ష‌న్‌గా తెర‌కెక్కింది. జీవితా స్వ‌యంగా ద‌ర్శ‌కత్వం వ‌హించ‌డంతో సినిమాపై అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్‌ జీవితా రాజ‌శేఖ‌ర్ త‌మ బాధ‌నంతా వెళ్ల‌బోసుకున్నారు.

ప్ర‌తిసారి త‌మ కుటుంబాన్నో లేదా… త‌మ కూతుళ్ల‌నో టార్గెట్ చేస్తూ వ‌స్తున్నార‌ని.. దీనికి సోష‌ల్ మీడియాలో కూడా ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతోందంటూ వాపోయారు. జీవిత శేఖ‌ర్ ప్ర‌మోష‌న్లో ఆర్య‌వైశ్యుల‌ను కించ‌ప‌రిచారంటూ జ‌రుగుతున్న ప్ర‌చారం ఖండించారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ త‌మ కుటుంబంపై జ‌రుగుతున్న దుష్ప్ర‌చారాన్ని ఖండించారు.

ఇటీవ‌ల త‌న కూతురు భాయ్‌ఫ్రెండ్‌తో దుబాయ్‌కు వెళ్లింద‌ని దుష్ప్ర‌చారం చేశార‌ని ఆమె వాపోయారు. ఓ సారి శివాత్మిక అంటారు.. కాదు శివానీ ప్రియుడితో పారిపోయింద‌ని అంటారు అంటూ ఆవేద‌న‌తో ఆమె చెప్పారు. త‌మ ఫ్యామిలీ అంతా క‌లిసి దుబాయ్‌కు వెళ్లినంత మాత్రాన దానికే ప్రియుడితో త‌న కూతురు దుబాయ్‌కు లేచిపోయింద‌ని ఎలా ? వార్త‌లు రాస్తార‌ని ఆమె ప్ర‌శ్నించారు.

ఇలాంటి అస‌త్యాలు ఎంతో మంది జీవితాల‌ను ప్ర‌భావితం చేస్తాయ‌ని.. ఇలా త‌ప్పు చేసే వాళ్ల‌ను న‌డిరోడ్డుపై కొట్టాల‌ని కూడా జీవిత పిలుపు ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇక సోష‌ల్ మీడియాలో వ‌చ్చే క‌థ‌నాల‌పై కోర్టుల చుట్టూ తిరిగే టైం త‌మ‌కు లేద‌న్నారు. ఇక రాజ‌శేఖ‌ర్ శేఖ‌ర్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వ‌చ్చిన ద‌ర్శ‌కుడు సుకుమార్ మాత్రం జీవిత‌పై ప్ర‌శంస‌లు కురిపించేశాడు.

ఓ ద‌ర్శ‌కుడికి ఎంత టెన్ష‌న్ ఉంటుందో త‌న‌కు తెలుసు అని.. ఈ సినిమా కేవ‌లం జీవిత గారి కోస‌మే హిట్ అవ్వాల‌ని తాను కోరుకుంటున్నాన‌ని చెప్ప‌డంతో పాటు ఆమెకు ఏకంగా దండ‌మే పెట్టేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news