Moviesit's Official: ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటి.. కేకపెట్టిస్తున్న కొత్త...

it’s Official: ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటి.. కేకపెట్టిస్తున్న కొత్త అప్డేట్

పాన్ ఇండియా హీరో ప్రభాస్..ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న మూవీ ‘ప్రాజెక్టు ఖ్’. మహానటి సినిమాను డైరెక్ట్ చేసిన నాగ్ అశ్వీన్ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇప్పటికే 70 శాతం సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇది పాన్ వరల్డ్ సినిమా అని నాగ్ అశ్విన్ చెప్పడం అందరిలో సినిమా పై భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు. ఖచ్చితంగా ఈ సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంటాడని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వైజ‌యంతీ మూవీస్ సంస్థ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్న ఈ సినిమాపై ఎనౌన్స్‌మెంట్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నేష‌న‌ల్ లెవ‌ల్లో అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమాలో బాలీవుడ్ లెజండ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక రోల్ ప్లే చేస్తున్నట్లు చిత్ర బృందం అఫిషియల్ గా ప్రకటీంచింది. ఇక హీరోయిన్‌గా బాలీవుడ్ క్రేజీ భామ దీపికా ప‌దుకొనే నటిస్తుంది. ఇదిలా ఉంటే ప్రాజెక్ట్‌ కె మూవీలోకి మరో హీరోయిన్‌ను తీసుకున్నారు. బాలీవుడ్‌ భామ దిశా పటానీకి వెల్‌కమ్‌ చెప్తూ ఆమెకు ఫ్లవర్ బొకే పంపారు. తెలుగులో లోఫర్ సినిమాతో పరిచయమై ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న దిశా పటాని ‘ప్రాజెక్టు K’లో నటించనుంది. దీంతో సినిమాలో గ్లామర్ కి ఏం కొదవ ఉండదు అని తెలిస్పోయింది.

సైన్స్ ఫిక్షన్ కథతో విజువల్ వండర్‌గా రూపొందనున్న ‘ప్రాజెక్టు కే’ మూవీ కోసం తోట తరణి పర్యవేక్షణలో హైదరాబాదులో మూడు భారీ సెట్లు వేశారు. ఈ సినిమా స్టోరీ ఎవ్వరు ఊహించని విధంగా..నిమిషానికి ఓ వండర్ లా తెరకెక్కించారట నాగ్ అశ్వీన్. ఈ కథ మొత్తానికి మూడు సీన్స్ చాలా హైలెట్ గా ఉంటాయని.. ప్రభాస్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచిపోనుందని తెలుస్తుంది. ప్రస్తుతం హైదరబాద్ లోనే వేసిన సెట్స్ లో చిత్రీకరణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. తాజా షెడ్యూల్లో ప్రభాస్ .. అమితాబ్ .. దీపిక పాల్గొంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news