Moviesఈ ఫొటో వెన‌క ఇంత క‌థ ఉందా... తార‌క్ మామూలోడు కాదు...!

ఈ ఫొటో వెన‌క ఇంత క‌థ ఉందా… తార‌క్ మామూలోడు కాదు…!

త్రిబుల్ ఆర్ విజ‌యంతో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ మాంచి జోష్‌లో ఉన్నాడు. ఈ సినిమాతో ఎంత లేద‌న్నా పాన్ ఇండియా ఇమేజ్ అయితే వ‌చ్చేసింది. త‌న తోటి యంగ్ హీరోలు పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకు పోతున్నారు. ఇక తార‌క్ ఈ విష‌యంలో ఆల‌స్యం చేసే ప్ర‌శ‌క్తే లేద‌న్న‌ట్టుగా నెక్ట్స్ స్టెప్పులు వేస్తున్నాడు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్లో తీసుకు వెళుతున్నారు. ఇదే విష‌యాన్ని కొర‌టాల శివ కూడా ఇప్ప‌టికే క‌న్‌ఫార్మ్ చేశాడు.

ఎన్టీఆర్‌తో తాను చేసే సినిమాకు బిగ్ స్పాన్ ఉంద‌ని కొర‌టాల చెప్ప‌డంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందం మామూలుగా లేదు. ఈ కొర‌టాల సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ లైన‌ప్‌లో సానా బుచ్చిబాబు ( ఉప్పెన ఫేం), ఆ త‌ర్వాత కేజీయ‌ఫ్ ఫేం ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో కూడా ఎన్టీఆర్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్ప‌టికే ప్ర‌శాంత్ నీల్ కూడా క్లారిటీ ఇచ్చారు.

ఇక తాజాగా సోష‌ల్ మీడియాలో ప్ర‌శాంత్ నీల్‌, ఎన్టీఆర్ ఇద్ద‌రూ త‌మ భార్య‌ల‌తో ఉన్న ఫొటో మామూలుగా వైర‌ల్ అవ్వ‌డం లేదు. ఈ ఫొటోలో ప్ర‌శాంత్ నీల్, అత‌డి స‌తీమ‌ణి లిఖిత‌, ఎన్టీఆర్‌, స‌తీమ‌ణి ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి క‌లిసి ఉన్నారు. ఈ ఫొటోతో ఎన్టీఆర్ త‌న అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేశారు. ఇటు ఎన్టీఆర్ దంప‌తుల వివాహ వార్షికోత్స‌వంతో పాటు, అటు ప్ర‌శాంత్ నీల్ దంప‌తుల వివాహ వార్షికోత్స‌వం కూడా మే 5నే కావ‌డంతో వీరిద్ద‌రు క‌లిసి త‌మ వెడ్డింగ్ యానివ‌ర్సిరీని సెల‌బ్రేట్ చేసుకున్నారు.

ఎన్టీఆరే స్వ‌యంగా నీల్ దంప‌తుల‌ను ఆహ్వానించి ఇద్ద‌రి వివాహ వార్షికోత్స‌వాన్ని సెల‌బ్రేట్ చేశాడు. ఈ ఫొటోను తార‌క్ స్వ‌యంగా షేర్ చేస్తూ ఒకే రోజు త‌మ ఇద్ద‌రి దంప‌తుల వివాహ వార్షికోత్స‌వం రావ‌డం.. వేడుక‌గా ఉంది. ఇదొక నూత‌న ఆరంభం అని చెప్పారు. ఇక ఈ ఫొటోతోనే ఎన్టీఆర్ నీల్‌తో త‌న సినిమా గురించి దాదాపు ప్ర‌క‌ట‌న ఇచ్చేశాడ‌నే అంటున్నారు.

అస‌లు కేజీయ‌ఫ్ రిలీజ్ అయిన‌ప్ప‌టి నుంచే సాయి కొర్ర‌పాటి ద్వారా నీల్‌, ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. అప్ప‌టి నుంచే నీల్ కూడా ఎన్టీఆర్‌తో సినిమా కోసం వెయిట్ చేస్తూ వ‌స్తున్నాడు. ప్ర‌భాస్ స‌లార్ త‌ర్వాత నీల్ తీసే సినిమా ఎన్టీఆరేదే అంటున్నారు. ఈ క్ర‌మంలోనే నీల్‌కు తార‌క్ ఓ స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news